ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మసక బారుతున్న ప్రభుత్వ విద్య…..

ప్రభుత్వ పాఠశాలను ఆధునికరించాలి….

ప్రభుత్వ విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు..

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

డిజిటల్ విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి.

సామాజిక అసమానతలు పెరిగే ప్రమాదం..

ఖమ్మం : ప్రభుత్వ విద్య మసకబారుతుందని,ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు నేడు వెలవెలబోతున్నాయని, విద్యార్థులు బడిబాట పట్టాలంటే సమస్యల పరిష్కారమే మార్గమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య( ఏఐఎస్ఎఫ్ ) భావిస్తుంది..

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులుకు గురికావాల్సి వస్తుంది, ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులలో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.

ఆర్భాటంగా ఫ్లెక్సీ పెట్టి, ఫోటో దిగి, బడిబాడ ప్రచారాన్ని నిర్వహిస్తే విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలలకు రారు.

ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించి, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ అభిప్రాయపడుతుంది.

తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ విద్యపై దృష్టి సారించి ప్రభుత్వ విద్య వ్యవస్థను ప్రతిష్టం చేయాలి గత ప్రభుత్వం ఏదైతే

విద్యార్థి వ్యతిరేక విధానాల అవలంబించిందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తుంది. కొత్తగా ఏర్పడిననటువంటి ప్రభుత్వం వల్ల విద్య రంగానికి ఒరిగిందేమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి మూడు సంవత్సరాల కావస్తున్నా కనీసం విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు.

రాష్ట్ర ప్రభుత్వం , ప్రభుత్వ విద్య రంగంపై దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలను ఆధునికరించాలి.

 

ప్రభుత్వ విద్యా విధానం రాజ్యాంగం కల్పించిన విద్య హక్కు ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత నిర్వీర్యం చేయడంతో సామాన్యులకి విద్య అనేది ప్రశ్నార్ధకంగా మారింది ఇప్పటికే ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వ విద్యను కాపాడడం అంటే కేవలం ఉచిత విద్యను అందించడమే కాదు పేద బడుగు , బలహీన వర్గాలకు సాధికారిత..

:-డిజిటల్ విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి:-విద్యార్థులకు టెక్నాలజీ చేరివేయడం విద్యను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి తరగతి గదుల్లో స్మార్ట్ బోర్డులో ప్రొజెక్టర్లు డిజిటల్

లెర్నింగ్ ప్రోగ్రాంలో మరియు కంప్యూటర్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు అదే గ్రామంలో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో పంపించాల్సిన బాధ్యత తీసుకొని గ్రామాలలో తల్లిదండ్రు లకు విశ్వసనీయత కల్పించి. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ బోధించే విద్యాబోధన మారాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది

 

:-సామాజిక అసమానతలు పెరిగే ప్రమాదం.

ప్రైవేట్ కార్పొరేట్ విద్య పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైవేట్ విద్యా ఖరీదైనది కాబట్టి పేద లు ప్రైవేట్ విద్యను వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. పేదలకు అందుబాటులో ఉండదు ఇది సమాజంలో అసమానతలు పెరగడానికి దారితీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మెరుగుపరిచే బడ్జెట్లో ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికరించబడతాయి.

ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం వలన ప్రభుత్వ విద్య వ్యవస్థ భవిష్యత్తు తరాలకి ప్రభుత్వ విద్య ప్రశ్నార్థకంగా మారుతుంది ఇది కేవలం విద్య వ్యవస్థ పైనే కాదు సమాజంలో అసమానతలు సమాజపు సమగ్రతపై ,సమానత్వం పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!