- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అడపా లచ్చయ్య దొర మాతృమూర్తి అడపా పుష్పావతి దురదృష్టవశాత్తు అకాల మరణం చెందగా సోమవారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి పుష్పావతి చిత్రపటాని పుష్పాంజలి ఘటించిన బిఆర్ఎస్ నాయకురాలు సున్నం లలిత ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబంలో ఆమె లోటు తీర్చలేనిదని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు ఈ కష్ట సమయాల్లో ఆ కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించాలని కోరుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో వెటర్నరీ స్టేట్ ప్రెసిడెంట్ మన్యం రమేష్ బాబు,రాచూరుపల్లి వైస్ సర్పంచ్ సోయం మల్లికార్జున్ రావు, రిపోర్టర్ శ్రీధర్, అబ్బులు, టీచర్ సున్నం ప్రసాద్ నాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు…

