ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేటమైలవరంలో ఎన్సీపీ మహిళా శక్తి ప్రదర్శన

మైలవరంలో ఎన్సీపీ మహిళా శక్తి ప్రదర్శన

📰 Generate e-Paper Clip

మద్దిశెట్టి శామ్యూల్‌కు అండగా నిలిచిన మహిళా కార్యకర్తలు.

ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

పొలిటికల్ పవర్, మైలవరం, సెప్టెంబర్ 10:ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్సీపీ–ఎన్డీఏ మహాకూటమి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సమావేశం ఉత్సాహంగా సాగింది. 14 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేశారు. పార్టీకి, మద్దిశెట్టి శామ్యూల్‌కు తమ మద్దతు కొనసాగుతుందని ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి ఎన్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పఠాన్ మున్నీ, రాష్ట్ర గౌరవ సలహాదారు తేనేటి ఇమాన్యుల్, జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ సైదా బేగం ముఖ్య అతిథులుగా హాజరై నాయకత్వం వహించారు. మద్దిశెట్టి శామ్యూల్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలపై నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. తమ నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.సభలో మద్దిశెట్టి శామ్యూల్‌కు మద్దతుగా మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు, నాయకత్వానికి అండగా నిలిచేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని నాయకులు తెలిపారు.

రూ.9.50 లక్షల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

మలమంటి వెంకటరత్నం అనే వ్యక్తి మద్దిశెట్టి శామ్యూల్ వద్ద తన కుమారుడి లండన్ ప్రయాణానికి అత్యవసరంగా డబ్బులు అవసరమని చెప్పి రూ.9.50 లక్షలు బ్యాంకు ఖాతా ద్వారా తీసుకున్నారని సమావేశంలో నాయకులు ఆరోపించారు. అనంతరం శామ్యూల్‌పై ఆరోపణలు చేస్తూ పార్టీకి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని వారు పేర్కొన్నారు.ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తులు వాస్తవాలను వెల్లడించాలని, అవసరమైతే చట్టపరమైన విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని నాయకులు డిమాండ్ చేశారు. రూ.9.50 లక్షల మొత్తాన్ని తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మూడు డిమాండ్లపై తీర్మానం..

సమావేశంలో కార్యకర్తలు పలు డిమాండ్లను ముందుకు తీసుకొచ్చారు. మద్దిశెట్టి శామ్యూల్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రూ.9.50 లక్షల మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని, పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే “దేనికైనా సిద్ధం.. పార్టీని కాపాడుకుంటాం.. మద్దిశెట్టి శామ్యూల్ వెంటే నడుస్తాం.. ఆయనకు అండగా ఉంటాం” అని కార్యకర్తలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు మహిళా విభాగం నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నక్క వాణి, బాయమ్మ, కరుణమ్మ, ఎస్.కె. మీరా రవి తదితరులతో పాటు 14 మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు, మహిళా సోదరీమణులకు మహిళా విభాగం కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!