ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్ర సిమెంట్ సాగర్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ్ వేడుకలు

ఆంధ్ర సిమెంట్ సాగర్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ్ వేడుకలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్‌ పవర్:పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు శివారులోని ఆంధ్ర సిమెంట్స్ లిమిటెడ్ నందు మిన్నంటిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ సంబరాలు – రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు.దేశవ్యాప్తంగా జరిగే 80వ స్వాతంత్ర్య దినోత్సవం మరియు ‘వందేమాతరం’ 150 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఆగస్టు 13 వ తేదిన ‘హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) కార్యక్రమ వేడుకలు ఆంధ్ర సిమెంట్స్ నందు
ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పల్నాడుడిసిఐఎఫ్‌త్రినాధ రావు మరియు ఐఎఫ్ తెనాలి రాజు పాల్గొని ఉద్యోగులు విద్యార్థులు కాలనీ మహిళలు జాతీయ జెండాలు చేతబట్టిజై జవాన్ జై కిసాన్ జై బోలో స్వతంత్ర భారత్ కి జై భారత్ మాతాకీ వందేమాతరం* అనే నినాదాలతో అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నుండి స్టేట్ హైవే వరకు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న పల్నాడు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాధ రావు మాట్లాడుతూ ప్రతి భారతీయ పౌరుడికి జాతీయ జెండా మీద గౌరవం, దేశం మీద భక్తి ఉండాలని దేశం కోసం సేవ చేయాలని తెలిపారు.ఫ్యాక్టరీ ఇన్స్పెక్ట ర్‌తెనాలి రాజు మాట్లాడుతూప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జెండాను ఎగురవేసి, జాతీయ జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసి దేశభక్తి చాటాలని కోరారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు మాట్లాడుతూ 2047 లోపు భారత దేశాన్ని ప్రపంచం లో విశ్వ గురువు గా తీర్చిదిద్దడమే భావి భారత పౌరుల లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఓ డి లు సుబ్రమణ్యం, శంకర్ నారాయణ రెడ్డి, లింగయ్య,డాక్టర్ ప్రసాద్, , భరత్ భూషణ్, అంబేద్కర్ రెడ్డి, సిడ్నీ శ్రీధర్, నరసింహులు,రామకృష్ణ మనోజ్ కుమార్ రెడ్డి , ఫణి కుమార్,హేమంత్, మహేంద్ర వర్మ, శ్రీకాంత్, ప్రసాద్,సి ఎస్ ఓ నారయనరావు, నరేందర్, సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగులు కార్మికులు కాలనీ మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!