ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంHIV ఎయిడ్స్ పై అవగాహన సదస్సు ర్యాలీ

HIV ఎయిడ్స్ పై అవగాహన సదస్సు ర్యాలీ

📰 Generate e-Paper Clip

బీరోలు గ్రామంలో HIV & ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు, ర్యాలీ

 

    1. బీరోలు గ్రామంలో సర్పంచ్ శ్రీ దేవభిక్షం ఆధ్వర్యంలో YRGK స్వచ్ఛంద సంస్థ ద్వారా HIV & ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో YRGK సూపర్‌వైజర్ నరేష్ , ఉషారాణి గారు, పద్మ  (HA), ఉప్పలమ్మ  (HA), పాఠశాల HM, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ASHA కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా HIV & ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు HIVపై ఉన్న అపోహల గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా HIV పరీక్ష (HIV Test) ప్రాముఖ్యతను వివరించారు. అనుమానం ఉన్నప్పుడు భయపడకుండా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో HIV పరీక్ష చేయించుకోవాలని సూచించారు. HIVను ముందుగానే గుర్తించడం ద్వారా అవసరమైన వైద్య సేవలు మరియు చికిత్సను పొందవచ్చని వివరించారు.

అనంతరం గ్రామంలో HIV & ఎయిడ్స్‌పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. HIV పరీక్షలు, నివారణ చర్యలు మరియు ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!