ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్*దేశభక్తి ప్రతి భారతీయుడి బాధ్యత.. జాతీయ ఐక్యతే దేశ బలం: ఏనుగు సుదర్శన్ రెడ్డి*

*దేశభక్తి ప్రతి భారతీయుడి బాధ్యత.. జాతీయ ఐక్యతే దేశ బలం: ఏనుగు సుదర్శన్ రెడ్డి*

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ ప్రతినిధి మల్కాజ్గిరి కమిషనరేట్ ఇంచార్జ్ ఏ. పాండు రంగారావు.                  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :మేడ్చల్ నియోజకవర్గం :

మేడిపల్లి డివిజన్‌లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లి డివిజన్ పరిధిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి డివిజన్ అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో చేపట్టిన ఈ ర్యాలీ దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి హాజరై, జిల్లా కార్యదర్శి జైపాల్ రెడ్డి, జిల్లా మాజీ బీజేవైఎం అధ్యక్షులు బండారి పవన్ రెడ్డి గారు, గారితో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ జెండా ప్రతి భారతీయుడి గర్వానికి ప్రతీక అని, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ ఐక్యతను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

“తిరంగా మన గర్వం.. భారత్ మన సంకల్పం” అనే స్ఫూర్తితో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

బైక్ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా ముందుకు సాగారు. కార్యక్రమం ఆద్యంతం దేశభక్తి, జాతీయ ఐక్యత సందేశాన్ని చాటుతూ ఉత్సాహభరితంగా కొనసాగింది.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు శేషగిరిరావు, జిల్లా ఎండోమెంట్ సభ్యురాలు నవ్య రెడ్డి, డివిజన్ కార్యదర్శి స్వప్న, సీనియర్ నాయకులు మామిడి వెంకటేష్, డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు జస్వంత్ గౌడ్, నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!