ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeతెలంగాణపేకాట శిబిరంపై పోలీసుల దాడి – ఇద్దరి పట్టివేత

పేకాట శిబిరంపై పోలీసుల దాడి – ఇద్దరి పట్టివేత

📰 Generate e-Paper Clip

కలసపాడు: ఆగస్టు 10 పొలిటికల్ పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎన్ ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలోని కంపచెట్ల కింద కొందరు వ్యక్తులు నగదు పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా, పోలీసులను గమనించిన కొందరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో షేక్ బాలయపల్లి చిన్న రసూల్, బొట్టా సుబ్బరాయుడు అనే ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా, వారి వద్ద ఉన్న రూ.14,000/- నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
విచారణలో తమతో పాటు బసిరెడ్డి శివారెడ్డి, గుర్రం జయరాం, కుందూరి నారాయణ @ అభి, ఏనుముల శ్రీనివాసుల రెడ్డి, అంకిరెడ్డి తదితరులు పేకాట ఆడినట్లు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే A3 నుంచి A7 వరకు పేర్కొన్న వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై కలసపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!