
08/08/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఎడిటర్ నామ వినోద్ కుమార్
చత్రినాక చౌరస్తాలో ప్రతిరోజు కొన్ని లక్షల ప్రజలు మరియు వాహనాలు ఇక్కడ నుండి ఉప్పుగూడ రైల్వే స్టేషన్ అలాగే కందికల్ రోడ్డు, లాల్ దర్వాజా, గౌలిపుర, రాజన్న బౌలి కి సంబంధించిన రోడ్డులో లక్షలలో ప్రతిరోజు ప్రజలు తిరుగుతుంటారు . రోడ్డు రద్దీగా ఉండడం వలన ప్రతిరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించడం జరుగుతుంది అలాగే అంబులెన్స్ కి దారి కూడా ఉండదు. ఇనుప స్తంభాల వలన కరెంటు షార్టు వచ్చి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. సి ఈ డి వారికి జిహెచ్ఎంసి అధికారులు నిధులు కేటాయిస్తే వారు కరెంటు స్తంభాలు తొలగిస్తామని అంటున్నారు. దయచేసి ఆషాడ మాసం బోనాలను దృష్టిలో పెట్టుకుని ఛత్రినాక చౌరస్తాలో ఇనుప కరెంటు స్తంభాలను తొలగించి చత్రినాక చౌరస్తా లో రోడ్డు వేస్తే విశాలంగా మరియు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుంది. దయచేసి జిహెచ్ఎంసి సౌత్ జోన్ కమిషనర్ వెంటనే చొరవ తీసుకోవాలని కోరడం జరుగుతుంది.
ఇట్లు
గడ్డమీది హరినాథ్ గౌడ్ బి ఏ
కన్వీనర్
తెలంగాణ ఉద్యమకారుల పోరం
