– జాతీయ మానవ హక్కులు సామాజిక న్యాయ సంఘం పేరిట ఆఫీస్ ప్రారంభించి,అమాయకులైన హోటల్లా యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తు డబ్బులు వసూళ్ళు,
– చిన్నచిన్న హోటళ్ళు నడుపుకుంటున్న అమాయక యాజమాన్యాలే టార్గెట్ చేసుకున్న జిటి. నారాయణ స్కూల్ కరస్పాండెంట్ రాఘవేందర్ యాదవ్, దయ్యాల శేఖర్ మాదిగ లపై కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎస్సై.విక్రమ్ స్పీడుగా స్పందించి వారిద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలివచ్చారు,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.11.2026. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో జాతీయ మానవ హక్కులు సామాజిక న్యాయ సంఘం పేరిట ఆఫీస్ ప్రారంభించి, చిన్నచిన్న హోటళ్ళు నడుపుకుంటున్న అమాయక యాజమాన్యాలే టార్గెట్ చేసుకున్న జి టి. నారాయణ స్కూల్ కరస్పాండెంట్ రాఘవేందర్ యాదవ్, పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామనికి చెందిన దయ్యాల శేఖర్ మాదిగ మీ హోటల్ ను సీజ్ చేయాల్సి వస్తుందని అమాయకులైన యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ లక్షలలో డబ్బులు వసూలు చేస్తున్నారని వీరిపై బాధితులు కంప్లీట్ చేయడంతో బాధితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై విక్రం తెలిపారు. మంగళవారం కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తకోట పట్టణంలోని వనపర్తి వెళ్లే రోడ్డు మార్గంలో గల జి టి. నారాయణ స్కూల్ దగ్గర జాతీయ మానవ హక్కులు సామాజిక న్యాయ సంఘం పేరిట ఆఫీస్ కొన్ని నెలల క్రితం ప్రారంభించుకున్నారని, వీళ్ళ ఇద్దరిలోదయ్యాల శేఖర్ అన్ని హోటల్లు తిరుగుతూ ఆ హోటల్లో ఏమైనా అవకతవకలు ఉంటే వాటిని రాసుకుని జిటి. రాఘవేందర్ కు ఆఫీస్ దగ్గర అప్పగించేవారు. ఈ హోటల్ యాజమాన్యం ఫోన్ నెంబర్ తీసుకొని ఈ రాఘవేందర్ ఆఫీస్ దగ్గరకు పిలిపించుకొని మీ హోటల్ కు లైసెన్సు లేదని ఏవేవో కొన్ని కారణాలు తెలిపి మీ హోటల్ ను సీజ్ చేయాల్సి వస్తుందని అమాయకులైన యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేసేవారు.మీ హోటల్ సీజ్ చేయకూడదంటే సీఐ, ఎస్సై, తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ గారలకు డబ్బులు ముట్ట చెప్పాల్సి వస్తుందినీ, కనీసం రెండు లక్షలైనా ఇవ్వాలని డిమాండ్ చేసి కనీసం లక్ష రూపాయలు వసూలు చేసేవారని అన్నారు.హోటల్లు నడుపుకునే యాజమాన్యం వారు భార్యాభర్త తల్లి తండ్రి అందరూ కలిసి ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి పని చేసుకుని హోటల్లు నడుపుకుంటున్నారు. ఇట్లాంటి కడు పేద వారి నుండి ఈ ఇద్దరు నిందితులు కూడా కోట్ల ఆస్తులు కలిగిన కలవారేనని, కోట్ల ఆస్తులు కలిగి ఉండి కూడా అక్రమ వసూళ్లకు పాల్పడి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకొని జైలు పాలు కావలసి వచ్చిందని అన్నారు. జిటి. నారాయణ స్కూల్లో ఇప్పటికే మూడుసార్లు మండల విద్యాధికారి సీజ్ చేశారని, స్కూల్ పై కూడా ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయని,వీరిద్దరూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా బాధితులందరూ బయటకు రావడం జరిగింది (సోషల్ మీడియాకు కృతజ్ఞతలు). ఒకరికొకరు కలవడం వల్ల ధైర్యం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంటు ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎస్సై. విక్రమ్ అంతకంటే స్పీడుగా స్పందించి వారిద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .


