ePaper
Wednesday, November 11, 2026
📄 ePaper

క్యాన్సర్ చికిత్స పొందిన టీడీపీ గౌస్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 10 2026: అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న టీడీపీ గౌస్ ను సాహితీ కళా వేదిక ప్రతినిధులు మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీడీపీ గౌస్ హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శస్త్రచికిత్స చేయించుకుని రెండు రోజుల క్రితం వనపర్తికి వచ్చారు. విషయం తెలుసుకున్న సాహితీ కళా వేదిక ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలతో మందులు వాడితే త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటావని కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ఆయనకు ధైర్యం చెప్పారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో ఉంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న తనకు చంద్ర శేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం అందించి శస్త్రచికిత్స చేయించారని గౌస్ కాగితంపై రాసి తన కృతజ్ఞతను తెలిపారు. గౌస్ ను పరామర్శించిన వారిలో సాహితీ కళా వేదిక సభ్యులు బైరోజు చంద్రశేఖర్, దేశి రాములు, గద్దె భాస్కర్, బండారు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Latest Articles

విద్యార్థులలో సృజనాత్మకత పెంచేందుకు వివిధ రకాల ఆటల పోటీలు. 

కలసపాడు నవంబర్ 11 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ సమగ్ర...

చంద్రబాబు అరాచకాలపై నిలదీసిన వైఎస్‌ జగన్‌! స్థానిక పోరులో అక్రమాల ఆవిష్కరణలను ప్రజలు గమనిస్తున్నారు!

తాడేపల్లి (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9...

సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

కేఎల్ఐ, జూరాల నీటి విడుదల కోసం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మెరుపు...

శ్రీశైల క్షేత్రంలో ఉచిత బస్సు సదుపాయం: ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు

శ్రీశైలం (పొలిటికల్ పవర్ - పిఎన్9 టీవీ):కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల...

*ఉచిత బస్సు సదుపాయం

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 11(పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

అక్రమార్కులు దౌర్జన్య పరుల పట్ల కొత్తకోట ఎస్సై.విక్రమ్ ఉక్కు పాదం

– జాతీయ మానవ హక్కులు సామాజిక న్యాయ సంఘం పేరిట ఆఫీస్ ప్రారంభించి,అమాయకులైన హోటల్లా యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తు డబ్బులు వసూళ్ళు,– చిన్నచిన్న హోటళ్ళు నడుపుకుంటున్న అమాయక యాజమాన్యాలే టార్గెట్ చేసుకున్న...

కరువుతో రైతులు కన్నీరు మున్నీరు.. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

– సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయ రాములు,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.11.2026.జిల్లాలో పంటలు ఎండికరువుతోరైతులుకన్నీరుమున్నీరవుతున్నారని కేంద్ర రాష్ట్ర...

టీపీసీసీ మీడియా కో-ఆర్డినేటర్‌గా మొగిలి సత్యారెడ్డి నియామకం

మాజీ సర్పంచ్ గట్టు మన్యం హర్షం.. ప్రత్యేక అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09 2026: పెద్దమందడి...
error: Content is protected !!