ePaper
Saturday, August 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అన్నాచెల్లెళ్లు అక్కాతమ్ముళ్ల మధ్యన... ప్రేమానురాగాలే రక్షా బంధన్

అన్నాచెల్లెళ్లు అక్కాతమ్ముళ్ల మధ్యన… ప్రేమానురాగాలే రక్షా బంధన్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ 29. ఆగస్టు 2026. రాఖీ అనేది సోదరి తన సోదరుడికి కట్టే ఒక పవిత్రమైన దారం. ఇది వారి మధ్య ఉన్నప్రేమ,రక్షణఅనుబంధాన్నిసూచిస్తుంది. సోదరుడు తన సోదరిని అన్ని కష్టాల నుండి రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. రాఖీ పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని వడ్డే వాట రోడ్ లో గల శ్రీ మహానంద మల్కి దాస్ ఆశ్రమంలో, శుక్రవారం ఆన్నదమ్ములకు అక్క చెల్లెలు రాఖీలు కట్టి ఘనంగా రాఖీపండుగదినోత్సవాన్నినిర్వహించారు.ఈసంద ర్భంగావారుమాట్లాడుతూఈపండుగరోజునసోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, తీపి పదార్థాలు తినిపిస్తారు, అలాగే సోదరులుతమసోదరీమణులకు బహుమతులు ఇస్తారు. రాఖీ పండుగ వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటిలోఒకకథనంప్రకారం, ద్రౌపది తన చీర కొంగును శ్రీకృష్ణుడి గాయపడిన వేలికి కట్టిందని, దానితో ఆమెకు రక్షగా నిలిచింది. అప్పటినుంచి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది.
రాఖీ పండగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు.ఆ రోజును సోదరి, సోదరుడి మధ్య పవిత్ర సంబంధానికి చిహ్నంగా భావిస్తారు. సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి అతని దీర్ఘాయుష్షు, ఆనందాన్ని కోరుకుంటుంది. సోదరుడుతనజీవితాంతంఆమెనురక్షిస్తాననివాగ్దానం చేస్తాడు.అయితేరాఖీనిసోదరుడికిమాత్రమేకట్టవచ్చా మరికేవరికైనా కట్టవచ్చా ఈ రోజుతెలుసుకుందాం. సోదరుడు,సోదరీమణులమధ్యవిడదీయరానిప్రేమకు చిహ్నంగా నిలిచే రాఖీ పండగభారతీయసంస్కృతిలో ఒక ముఖ్యమైనపండుగశతాబ్దాలుగాసోదరీమణులు తమసోదరులమణికట్టుకురాఖీకట్టివారికిదీర్ఘాయుష్షు,ఆనందాన్నికోరుకోవడం,సోదరులుతమసోదరీమణులను రక్షించడానికి ప్రతిజ్ఞ చేయడం ఒకసంప్రదాయం. రాఖీ పండుగ రోజున ఒక సోదరి తన సోదరుడికి కాకుండా మరెవరికి రాఖీకట్టగలదోతెలుసుకుందాం.
దేవుడికి రాఖీ కట్టే సంప్రదాయం రాఖీ కట్టే మొదటి హక్కు దేవుడిదే అని భావిస్తారు. చాలా మంది సోదరీమణులు మొదట శ్రీకృష్ణుడు, శివుడు లేదా గణేశుడికి రాఖీ కడతారు. తరువాత తమసోదరుడికి రాఖీ కడతారు. ఇలా చేయడం అంటే దేవుడే తమకు మొదటి రక్షకుడు అనే విశ్వాసానికి నిదర్శనం. అక్కకి చెల్లెలు రాఖీకట్టే సంప్రదాయం ఏ యువతికి అయినా అన్నదమ్ములు లేకుంటే ఆమెకు అక్కాచెల్లెలుఉన్నట్లు అయితే.. ఆమె తన అక్కకు రాఖీ కట్టవచ్చు. ఇది సోదరీమణుల అనుబంధం, ప్రేమ, ఐక్యతకు చిహ్నం. గురువుకు రాఖీ భారతీయ సంస్కృతిలో గురువును దేవునితో సమానంగా భావిస్తారు. ఒక శిష్యుడు తన గురువుకు రాఖీ కట్టడం అంటే.. అతను గురువును రక్షించి, సేవ చేసి, గౌరవిస్తానని వాగ్దానం చేస్తున్నట్లు అర్థం. పూజారులు, సాధువులు, ఋషులకు రాఖీ చాలా ప్రదేశాలలో మహిళలు సాధువులు, ఋషులు లేదా ఆలయ పూజారులకు రాఖీ కడతారు. ఇదిమత విశ్వాసం,ఆధ్యాత్మికసంబంధానికిగుర్తుగానిలుస్తుంది. ఈ సంప్రదాయం ముఖ్యంగా బృందావనం, మధుర, హరిద్వార్,వంటిపుణ్యక్షేత్రాలలోకనిపిస్తుంది.సైనికులకు రక్షణ దారంగా రాఖీ సందర్భంగా సోదరీమణులు భారతసైన్యం,పోలీసు,పారామిలిటరీదళాలసైనికులకు రాఖీని పంపుతారు లేదా వారే వెళ్లి స్వయంగా రాఖీని కడతారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ధూపం.ఈశ్వర్,ధూపం.శివశంకర్,ధూప.శివరములు,టి.తిరుపతమ్మ,యస్.వేంకటేశ్వరమ్మ,టి.సౌభాగ్యలక్ష్మి, యం. శంకరమ్మ,డి. భవ్యశ్రీ,యస్.తేజస్విని,యం. వైష్ణవి, లక్మన్న,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!