ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

అలుగు ఉధృతికి రహదారి జలమయం.. భద్రాచలం మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత

📰 Generate e-Paper Clip

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు: ఎస్సై సాయి కిషోర్ రెడ్డి

పొలిటికల్ పవర్, ఆర్సి ఇంచార్జ్ ఎం.నాగార్జున,    అశ్వారావుపేట, అక్టోబర్ 4:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని అంకమ్మ తల్లి చెరువు నిండి అలుగు ఉధృతంగా ప్రవహించడంతో అశ్వారావుపేట–భద్రాచలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చెరువు నుంచి వెలువడుతున్న వరద నీరు రహదారిపైకి చేరడంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది.

రహదారిపై వరద ప్రవాహం పెరగడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు, అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు, భారీ లారీలు, ప్రైవేట్‌ వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానిక అధికారులు వరద నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. డీడీఆర్‌ఎఫ్‌ (DDRF) బృందాలను అందుబాటులో ఉంచామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి, వరద ప్రవాహం తగ్గితే మరుసటి రోజు ఉదయం 10 గంటలలోపు రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వరద నీటి ప్రవాహం తగ్గే వరకు ఈ మార్గంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

Latest Articles

మొగరలగుప్ప మూకమామిడి మధ్య వంతెన కూలిపోయి రాకపోకలకు అంతరాయం

వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రెస్క్యూ  టీం మూకమామిడి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి...

కుర్చీకే పరిమితం కాని అధికారి.. ప్రజల మధ్యే దమ్మపేట తహశీల్దార్‌ మురళి

ఆపదలో ప్రజలకు అండగా.. ఆదర్శంగా నిలిచిన దమ్మపేట తహసిల్దార్! తుపాను వేళ క్షేత్రస్థాయిలో పర్యటన.....

తుఫాను వేళ ప్రజల చెంతకు.. మందలపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ చొరవ

వరద నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండ పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్...

భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము

పంట నష్టంపై తక్షణ సర్వే చేపట్టి పరిహారం అందించాలిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పెద్దవాగు ప్రాజెక్టు రింగ్‌బండ్‌కు గండి

వరద ఉధృతికి దెబ్బతిన్న రింగ్‌బండ్‌.. పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళనపొలిటికల్ పవర్,అశ్వారావుపేట...

మనిగిల్లలో మహిళా గ్రామసభ.. నూతన మహిళా సంఘ భవన నిర్మాణానికి స్థలం గుర్తింపు

మహిళా సంఘాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక...

Related Articles

కుర్చీకే పరిమితం కాని అధికారి.. ప్రజల మధ్యే దమ్మపేట తహశీల్దార్‌ మురళి

ఆపదలో ప్రజలకు అండగా.. ఆదర్శంగా నిలిచిన దమ్మపేట తహసిల్దార్! తుపాను వేళ క్షేత్రస్థాయిలో పర్యటన.. వరద బాధితులకు సహాయక చర్యలుదమ్మపేట, నవంబర్ 4: ప్రభుత్వ ఉద్యోగి అంటే కార్యాలయాలకే పరిమితమనే అభిప్రాయానికి భిన్నంగా, ప్రజల కష్టాల్లో...

తుఫాను వేళ ప్రజల చెంతకు.. మందలపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ చొరవ

వరద నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండ పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 4: తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు దమ్మపేట మండలం మందలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాలు వరద నీటితో...

భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము

పంట నష్టంపై తక్షణ సర్వే చేపట్టి పరిహారం అందించాలిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున, దమ్మపేట, నవంబర్ 4: దమ్మపేట మండలంలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రైతాంగం...
error: Content is protected !!