వరద నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండ
పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 4: తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు దమ్మపేట మండలం మందలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన మందలపల్లి సర్పంచ్ గుజ్జుల శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ మురళి సహాయక చర్యల్లో పాల్గొన్నారు
వరద నీటితో ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు వారు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. రాకపోకలకు ఆటంకం కలగకుండా అవసరమైన సహాయక చర్యలు చేపట్టడంలో చొరవ చూపారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.


