వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రెస్క్యూ టీం
మూకమామిడి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి అలుగు ఉగ్రరూపం దాల్చిన వాగులు..ముంపునకు గురైన ఇళ్లు
అశ్వారావుపేట పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక న్ వి ఆర్ 9టీవీ న్యూస్ (ఆర్సి కారం వెంకటేష్ ):ములకలపల్లి, నవంబర్ 04:మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలకు వాగులు,వంకలుఉగ్రరూపంద ల్చిపొంగిప్రవహిస్తున్నాయి.ములకలపల్లి మండల వ్యాప్తంగా కుండపోత వర్షం కురవడంతో జనజీవనంపూర్తిగాస్తంభించిపోయింది. బుధవారం ఉదయం నాటికి మండలంలోఅత్యధికంగా 231.8 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మూకమామిడి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అలుగు పారుతోంది. వాగులో చిక్కుకున్న ఒక వ్యక్తిని రెస్క్యూ టీం సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది.మూకమామిడి – మొగరలగుప్ప గ్రామాల మధ్య ఉన్న వాగులో వంతెన పూర్తిగా తెగిపోవడంతో గ్రామస్తులకు రాకపోకలుపూర్తిగానిలిచిపోయాయి.ఎటు నుంచి ఏ మార్గం లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

చెరువులు అలుగు పారడంతో రోడ్లు కోతకు గురై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీరు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగాప్రవహిస్తోంది.మూకమామిడి పంచాయతీ పరిధిలో చెరువు పొంగి పొర్లడంతో వరద నీరు ఇళ్లలోకి చేరి పలు ఇళ్లు ముంపునకు గురయ్యాయి.ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ..ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకురావద్దని,వాగులు,వంకల వైపు ఎవరూ వెళ్లకూడదని సూచించారు.అత్యవసరమైతే పంచాయతీ సిబ్బందికి తెలియపరచాలని,పంచాయతీలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రిస్క్యూ టీం,సమాచారం అందించిన వెంటనే సహకరించిన స్థానిక ఎస్సై మధు ప్రసాదుకు, ఎమ్మార్వో స్వాతి బిందు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


