ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

అవినీతికి అడ్డాగా కీసర. కీసరలో ఆగని ఖాకీల అవినీతి దందా. రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్​ఐ.

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

మేడ్చల్ జిల్లా: కీసర: మల్కాజ్గిరి కమీషనరేట్, కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఛార్జిషీట్‌ విషయంలో ఓ వ్యక్తికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు త్వరగా దాఖలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఎస్‌ఐ కొండారెడ్డి శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా నాగారం పరిధిలోని శిల్పానగర్‌ కాలనీలో సోమవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ వివరాలను హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ వెల్లడించారు.                                                          రూ.5 లక్షలు డిమాండ్ రూ.2 లక్షలకు ఒప్పందం.కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తిపై చీటింగ్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై ఉన్న సదరు వ్యక్తి కోర్టు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఠాణాలో హాజరవుతున్నాడు. ఈ క్రమంలో కేసు ఛార్జిషీట్‌లో అతనికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు త్వరగా దాఖలు చేసేందుకు ఎస్‌ఐ కొండారెడ్డి శ్రీనివాస్ రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అంత మొత్తం చెల్లించలేనని బాధితుడు చెప్పడంతో చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరింది.

 

నగదు ఇవ్వాలని ఎస్‌ఐ తరచూ ఫోన్‌ చేసి బాధితుడిపై ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించారు. ఎస్‌ఐ వేధింపులతో విసిగిపోయి, ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. వారి సూచనల మేరకు లంచం నగదును ఓ కవర్‌లో పెట్టుకుని నాగారం పరిధిలోని శిల్పానగర్‌ కాలనీకి వెళ్లాడు. అక్కడ ఎస్‌ఐ రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ బృందం దాడి చేసి పట్టుకుంది. అనంతరం ఎస్‌ఐను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 1064 కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ గంగసాని శ్రీధర్ సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Latest Articles

లోకకల్యాణ సంకల్పం – విశేష అర్చనలు

 ముందుగా ఘంటామఠంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమం నిర్విఘ్నంగా...

అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలో నాలుగవ వార్డు. 15వ వార్డులో సీసీ రోడ్లు...

హైదరాబాద్‌పై కమ్ముకొస్తున్న కాలుష్య ముప్పు:  మరో ఢిల్లీగా మారుతుందా?*

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్...

టీపీసీసీ మీడియా కో-ఆర్డినేటర్‌గా మొగిలి సత్యారెడ్డి నియామకం

మాజీ సర్పంచ్ గట్టు మన్యం హర్షం.. ప్రత్యేక అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర...

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ విజేత ఇప్పల వెంకట కృష్ణారెడ్డి భారీ పాదయాత్ర.. స్వామివారి దర్శనం!

ఎన్టీఆర్ జిల్లా (పొలిటికల్ పవర్):  ప్రతినిధిఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం...

Related Articles

తొలిసారి జెడ్పిటిసిగా గెలిపొందిన తరువాత టిడిపి కార్యాలయంలో అడుగు పెట్టిన సిరమ్మ తెర్లాం టీడీపీ కార్యాలయంలో సిరమ్మ ఘన ప్రవేశం తొలిసారి కార్యాలయానికి విచ్చేసిన సిరమ్మ, ప్రదీప్ నాయుడులకు ఎంపీటీసీలు,...

 తెర్లాం, నవంబర్ 9: పొలిటికల్ పవర్ ప్రతినిధిరాజకీయ వారసత్వాన్ని కేవలం పదవిగా కాకుండా, ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర బాధ్యతగా మలచుకోవాలనే గొప్ప సంకల్పంతో తెర్లాం రాజకీయాల్లో ఒక సరికొత్త...

error: Content is protected !!