ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ఘనంగా చేయాలి

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ఘనంగా చేయాలి

📰 Generate e-Paper Clip

– జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 07.2026.

ఆగస్టు 15వ తేదీన దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు, అధికారులకు, ఆహ్వానితులందరికీ ఆహ్వానాలు, అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేడుకలకు వేదిక ఏర్పాట్లు సహా హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు అవసరమైనసౌకర్యాలుపకడ్బందీగాకల్పించాలన్నారు. పోలీసు గౌరవ వందనంతో పాటు, బందోబస్తు కల్పించాలనిపోలీసుఅధికారులకుసూచించారు.వేడుకల ప్రాంగణంలో తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ అధికారులుచర్యలుతీసుకోవాలనసూచించారు.సంస్కృతి,సంప్రదాయాలనుప్రతిబింబించేలాసాంస్కృతికకార్యక్రమాలునిర్వహించాలనిపేర్కొన్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా వివిధ శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలఏర్పాట్లలోఎక్కడఎలాంటిపొరపాట్లుజరగకుండావిజయవంతంగానిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.ఈసమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జెడ్పి సీఈవో యాదయ్య, సిపిఓ హరికృష్ణ, ఆర్డీవో సుబ్రహ్మణ్యం ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!