ePaper
Saturday, August 29, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఆగస్టు 31 సంచార జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి   

ఆగస్టు 31 సంచార జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి   

📰 Generate e-Paper Clip

సంచార జాతుల హక్కుల సంఘం ఖమ్మం జిల్లా
సంచార జాతుల హక్కుల సంఘం ఖమ్మం జిల్లా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు సంచార జాతుల హక్కులు, సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. ఖమ్మం: ఆగస్టు 31 సంచార జాతుల దినోత్సవం సందర్భంగా సంచార జాతుల హక్కులు, సమస్యలు మరియు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సంచార జాతుల హక్కుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు వల్లెపు సోమరాజు డిమాండ్ చేశారు. సంచార జాతులు తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ కార్యక్రమాల్లో సంచార జాతులకు తగిన ప్రాధాన్యత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన ప్రధాన డిమాండ్లు సంచార జాతుల కుటుంబాల సమగ్ర సర్వే నిర్వహించాలి. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలి. పిల్లలకు విద్య, స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ వసతి కల్పించాలి. యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి. సంచార జాతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సంచార జాతుల సంస్కృతి, సంప్రదాయాలు మరియు జీవన విధానాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బత్తుల గోపాల్ , జిల్లా ఉపాధ్యక్షులు గోగుల ఆది దేవండ్ల వెంకన్న , నాయకులు శ్రీరాములు. మాట్లాడుతూ… సంచార జాతుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “సంచార జాతుల హక్కులు కాపాడాలి – సంక్షేమం అందరికీ చేరాలి – అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి” అని వారు డిమాండ్ చేశారు. ఆగస్టు 31 సంచార జాతుల దినోత్సవాన్ని కేవలం వేడుకగా కాకుండా, సంచార జాతుల సమస్యల పరిష్కారానికి కొత్త కార్యాచరణకు నాంది పలికే రోజుగా నిర్వహించాలని వారు కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!