పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 14: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన కూకలకుంట రమేష్–కవిత దంపతుల కుమార్తె తరుణి, శ్రీహర్షల నిశ్చితార్థ వేడుక శనివారం సత్తుపల్లి పట్టణంలోని రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే నూతన జంట తరుణి, శ్రీహర్షలను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ వేడుక సందడిగా సాగింది.
ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల మాజీ సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, కూకలకుంట రవి, ఉడతనేని మధు, రవి, నాని, చెట్టయ్య, మురహరి రాంబాబు తదితరులు పాల్గొని నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.


