గుండెలో రంధ్రం.. రూ.10 లక్షలతో హార్ట్ సర్జరీ.. వైద్య ఖర్చులు భరించలేక తల్లిదండ్రుల ఆవేదన.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 14 2026: జూలూరుపాడు మండలం చెందిన గోలి ప్రవీణ్, అఖిల దంపతుల నెలన్నర వయసున్న చిన్నారి వైష్ణవి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం జిల్లాలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. చిన్నారికి హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని, ఇందుకు సుమారు రూ.5లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు ఇంతటి భారీ వైద్య ఖర్చులను భరించలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చిన్నారి చికిత్సకు రోజుకు సుమారు రూ.20.000 వేల వరకు ఖర్చవుతుండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కన్నబిడ్డను కాపాడుకోవాలనే తపన ఉన్నప్పటికీ చేతిలో చిల్లిగవ్వ లేక దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాతలు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు మానవతా దృక్పథంతో స్పందించి చిన్నారి వైష్ణవి చికిత్సకు తమకు తోచిన ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మీరు అందించే చిన్న మొత్తమైనా ఆ పసిపాప ప్రాణాలను కాపాడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు. సహాయం అందించదలచిన వారు ఫోన్‌పే ద్వారా ఆర్థిక సహాయం చేయవచ్చు. ఫోన్‌పే వివరాలు: పేరు: నందిని మెరుగు ఫోన్‌పే నంబర్: 9346034734పసిప్రాయంలోనే ప్రాణాలతో పోరాడుతున్న చిన్నారి వైష్ణవి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించి ఆపన్నహస్తం అందించాలని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.


