పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నేడు వాంగడి మండలంలో గల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఎమ్మార్పీఎస్ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు మాదిగ ఎంఎస్ఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి కొమ్ము శేఖర్ మాదిగ కొమరం భీం జిల్లా కోయి ఇన్చార్జి జంగాపల్లి రాజేష్ మాదిగ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను సందర్శించి ప్రిన్సిపాల్ ను ఇతర అధికారులను విచారించడం జరిగింది. అనంతరం రేగుంట కేశవ్ రామ్ మాదిగ కొమ్ము శేఖర్ మాదిగ లు మాట్లాడుతూ… ప్రభుత్వ డిగ్రీ కాలేజీని పట్టించుకోని ప్రభుత్వం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలో గల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని దాదాపు 12 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐదు ఆరు సంవత్సరాలు నడుస్తున్న కాలేజీలో నేటికీ త్రాగటానికి నీటి వసతి లేకపోవడం కనీసం సరియైన రోడ్డు లేకపోవడం సిగ్గుచేటు అసలు కొమరం భీమ్ జిల్లాలో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతుంది. డిగ్రీ కాలేజీ కి పోయే దారిలో బస్ స్టాప్ లేకపోవడం బస్సు షెల్టర్ లేకపోవడం తో విద్యార్థులు ఎన్ని ఇబ్బందుల కు గురవుతున్నారో ఆ దేవుడికే తెలుసు, డిగ్రీ కాలేజీలో దాదాపు 450 వరకు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉన్న ఎలాంటి వసతులు కల్పించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. డిగ్రీ కాలేజీ నిర్మాణం చేసి బాయ్స్ హాస్టల్ నిర్మాణం చేసి దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు గడుస్తున్నా అట్టి హాస్టల్‌ను ఎందుకు వినియోగంలోకి తీసుకురావడం లేదు. బాయ్స్ హాస్టల్ నిర్మాణం చేసి ప్రభుత్వం గర్ల్స్ హాస్టల్ ను ఎందుకు నిర్మాణం చేయలేదు. 12 కోట్ల రూపాయలు అసలు ఏమి చేశారు నిరుపేద ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్థులకు సరియైన వసతులు కల్పించని డిగ్రీ కాలేజీ ఎందుకు వెంటనే మూసివేయండి లేదా అన్ని రకాల అంగులతో కూడిన వసతు లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము లేనియెడల డిగ్రీ కాలేజీలో గల సమస్యల సాధన కై ఎమ్మార్పీఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణ ప్రకటించి త్వరలో ఆసిఫాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చెప్ప వద్ద రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది

