ePaper
Saturday, November 14, 2026
📄 ePaper

కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఫలించిన మంత్రి తుమ్మల కృషి

📰 Generate e-Paper Clip

ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసిన ఎయిర్పోర్ట్ అథారిటీ

 సుజాతనగర్ వద్ద 667 ఎకరాలలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు

 రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.

 ఇక భూసేకరణ, ఇతర అంశాలపైనే సర్కారు దృష్టి.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గగన యానానికి రెక్కలు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన రామ్మోహన్ నాయుడు సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశీలనకు ఏవీఎస్ అధికారులను పంపించారు. గత నెలలో ఏవీఎస్ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించి సుజాతనగర్ ను అనువైన ప్రదేశంగా గుర్తించి, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. సుజాతనగర్ వద్ద సుమారు 667 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. కేంద్రం నుంచి అనుమతి రావడంతో భూ సేకరణ మరియు ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. భద్రాచలం కొత్తగూడెం జిల్లా విమానాశ్రయ ఏర్పాటులో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Latest Articles

ఆత్మీయంగా సాగిన నిశ్చితార్థ వేడుక..నూతన జంటకు సోయం వీరభద్రం ఆశీస్సులు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 14: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన కూకలకుంట...

ప్రజా పాలన ప్రభుత్వంలో మంజూరైన కొత్త పింఛన్లు

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9...

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పట్టించుకోని ప్రభుత్వం

పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్...

మంచి నీటి ఏద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి..

సిపిఎం పినిరెడ్డిగూడెం గ్రామ శాఖ కమిటీ డిమాండ్... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

చిన్నారి వైష్ణవి ప్రాణాలకు ఆపన్నహస్తం అందించండి

గుండెలో రంధ్రం.. రూ.10 లక్షలతో హార్ట్ సర్జరీ.. వైద్య ఖర్చులు భరించలేక...

Related Articles

మంచి నీటి ఏద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి..

సిపిఎం పినిరెడ్డిగూడెం గ్రామ శాఖ కమిటీ డిమాండ్... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి: గార్ల: పినిరెడ్డిగూడెంలో మంచి నీటి ఏద్దడి నివారణకు...

చిన్నారి వైష్ణవి ప్రాణాలకు ఆపన్నహస్తం అందించండి

గుండెలో రంధ్రం.. రూ.10 లక్షలతో హార్ట్ సర్జరీ.. వైద్య ఖర్చులు భరించలేక తల్లిదండ్రుల ఆవేదన. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

ప్రజా పాలన ప్రభుత్వంలో చేయూత పింఛన్ పత్రాలు పంపిణీ ఎమ్మెల్యే కోరం కనకయ్య

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 న్యూస్ / నవంబర్ 14 టేకులపల్లి మండల ప్రతినిధి సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఇల్లందు నియోజకవర్గ...
error: Content is protected !!