ePaper
Friday, November 13, 2026
📄 ePaper

ఇంటర్ విద్యా వ్యవస్థ రద్దు సంస్కరణ కాదు.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు ఆపాలి! పాఠశాల విద్యలో ఇంటర్ విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి: ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్కే చాంద్ పాషా విలీనాల పేరుతో ప్రభుత్వ విద్యను బలహీనపరచడం తగదని ఆగ్రహం కళాశాలల ఉనికి, అధ్యాపకులు, ఉద్యోగుల భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్

📰 Generate e-Paper Clip

జూలూరుపాడు, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ – పీఎన్9 తెలుగు న్యూస్):

తెలంగాణలో దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యకు పునాదిగా నిలుస్తున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి 10+2 విధానాన్ని అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం పరిపాలనా మార్పుల పేరుతో ఇంటర్ వ్యవస్థను రద్దు చేయడం సరైన విధానం కాదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్కే చాంద్ పాషా డిమాండ్ చేశారు.

గ్రూపుల ప్రత్యేకత, పోటీ పరీక్షల సన్నద్ధత ఏం కావాలి? గురువారం జూలూరుపాడులో ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంలో నిర్మాణాత్మక సంస్కరణలను తాము వ్యతిరేకించడం లేదని, కానీ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయడం తగదన్నారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ వంటి గ్రూపుల ప్రత్యేకతతో పాటు జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక బోధన, ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల సేవలు యథావిధిగా కొనసాగుతాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల భవిష్యత్తుపై స్పష్టత లేకుండా వ్యవస్థను మార్చడం వల్ల కళాశాలలు మూతపడి వేలాది మంది కాంట్రాక్ట్, గెస్ట్ అధ్యాపకులు, ప్రైవేట్ సిబ్బంది రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలల విలీనంతో పేద విద్యార్థులకు విద్య దూరం: మరోవైపు పాఠశాలల విలీనం పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో బడులను కేంద్రీకరిస్తే పేద విద్యార్థులు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని చాంద్ పాషా పేర్కొన్నారు. దీనివల్ల రవాణా సమస్యలు, ముఖ్యంగా బాలికల భద్రత, దివ్యాంగ విద్యార్థుల ఇబ్బందులు పెరిగి దళిత, గిరిజన, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. పేదరికం, హాస్టళ్ల కొరత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ జాప్యం వంటి మూలకారణాలను పరిష్కరించకుండా విలీనాలతో డ్రాపౌట్స్ తగ్గుతాయని భావించడం అవివేకమన్నారు.

విస్తృత చర్చ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి: విద్య అనేది వ్యాపార వస్తువు కాదని, ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా విలీనాల పేరుతో వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేయడం వల్ల సామాన్య కుటుంబాలే నష్టపోతాయన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ముందుకు సాగాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సకాలంలో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Latest Articles

Related Articles

తొలితరం ఎమ్మార్పీఎస్ రెండు జిల్లాల కమిటీల ఏకగ్రీవ ఎన్నిక!  * ఖమ్మంలో ఘనంగా తొలితరం ఎమ్మార్పీఎస్ ఉద్యమకారుల సమావేశం  * 30 ఏళ్లుగా ఉద్యమంలో త్యాగాలు చేసిన సీనియర్ నాయకుల...

ఖమ్మం, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జ్ యర్ర నాగరాజు రెడ్డి):తొలితరం ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)...

నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సేవలే లక్ష్యం: సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ మాధవరావు  * ములకలపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక  * బిల్లుల హెచ్చుతగ్గులు, లోవోల్టేజీ, వ్యవసాయ సర్వీసులపై...

ములకలపల్లి (అశ్వారావుపేట), నవంబర్ 12 (పొలిటికల్ పవర్ - ఆర్సీ కారం వెంకటేష్):విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వినియోగదారుల...

ఖమ్మంలో రాజకీయ అండతో కబ్జాల దందా.. హార్కర్‌ బావి సెంటర్‌లో కాల్వ, రోడ్డు ఆక్రమణల పర్వం!  ప్రభుత్వ స్థలాలు, డ్రైనేజీలే లక్ష్యంగా చెలరేగుతున్న కబ్జాదారులు  నాలుగు షట్టర్లు నిర్మించి దర్జాగా అద్దెకు.. నిత్యం...

 ఖమ్మం, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక - పొలిటికల్ న్యూస్ 9 టీవీ పరిశోధనాత్మక కథనం):ఖమ్మం నగరంలో కబ్జాదారుల అరాచకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. సామాన్యుడు అంగుళం జావు...
error: Content is protected !!