ఖమ్మం, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక – ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జ్ యర్ర నాగరాజు రెడ్డి):
తొలితరం ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం ఖమ్మం నగరంలో తొలితరం ఎమ్మార్పీఎస్ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. గత 30 సంవత్సరాలకు పైగా ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అలుపెరగని పోరాటాలు చేసి, అనేక త్యాగాలు చేసిన సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
తొలితరం నాయకుల కమిటీ ఆవశ్యకత ఎంతో ఉంది: అల్లారు రత్నం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తొలితరం ఎమ్మార్పీఎస్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లారు రత్నం ప్రసంగిస్తూ.. ఉద్యమ పునాదులు వేసిన తొలితరం నాయకుల కమిటీ ఆవశ్యకత నేడు ఎంతో ఉందని వివరించారు. సీనియర్ ఉద్యమకారులందరూ ఏకతాటిపైకి వచ్చి జాతి హక్కుల సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
నూతన కమిటీల వివరాలు:
సమావేశంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని రెండు జిల్లాల కమిటీలను నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు:
* ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి: మట్టే గురుమూర్తి
* ఖమ్మం జిల్లా కన్వీనర్: కొరకొప్పుల రామారావు
* ఖమ్మం జిల్లా కో-కన్వీనర్: దగ్గుపాటి రమాదేవి
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్: గొడ్ల మోహన్రావు
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో-కన్వీనర్: కనుకుంట్ల నిర్మల
పాల్గొన్న నాయకులు:
ఈ సమావేశంలో తొలితరం ఎమ్మార్పీఎస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నకరికంటి సంజీవరావు, రాష్ట్ర కార్యదర్శి చిట్యాల సాయన్న, అఖిల్ మరియు ఉమ్మడి జిల్లాలోని సీనియర్ ఉద్యమకారులు తదితరులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


