ePaper
Friday, November 13, 2026
📄 ePaper

నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సేవలే లక్ష్యం: సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ మాధవరావు  * ములకలపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక  * బిల్లుల హెచ్చుతగ్గులు, లోవోల్టేజీ, వ్యవసాయ సర్వీసులపై మూడు అర్జీల స్వీకరణ  * నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

📰 Generate e-Paper Clip

ములకలపల్లి (అశ్వారావుపేట), నవంబర్ 12 (పొలిటికల్ పవర్ – ఆర్సీ కారం వెంకటేష్):

విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) ఛైర్మన్, టెక్నికల్ మెంబర్ కె.మాధవరావు స్పష్టం చేశారు. గురువారం ములకలపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక సీజీఆర్ఎఫ్ వేదికకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.

సమస్యల సత్వర పరిష్కారానికి ఆదేశాలు:

ఈ కార్యక్రమానికి ములకలపల్లి, పాల్వంచ మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి వినియోగదారులు తరలివచ్చి తమ ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా విద్యుత్ బిల్లుల్లో హెచ్చుతగ్గులు, లోవోల్టేజీ, సరఫరాలో అంతరాయాలు, మీటర్ల సాంకేతిక లోపాలు, వ్యవసాయ సర్వీసుల కనెక్షన్లకు సంబంధించి మొత్తం మూడు ఫిర్యాదులు అందాయి. వేదిక వద్దే అర్జీలను స్వీకరించిన ఛైర్మన్ మాధవరావు, ఫైనాన్స్ మెంబర్ ఎస్.సత్యనారాయణలు సమస్యల తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశిత గడువులోగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పాల్గొన్న అధికారులు:

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ జి.మహేందర్, డీఈ జె.బద్రు పవార్, ఎస్ఏవో శ్రీధర్, ఏడీఈ కె.రాంప్రసాద్, ఏఈ బోయపాటి నరేష్, సబ్ ఇంజినీర్ సీహెచ్.శ్రీను, ఆయా గ్రామాల సర్పంచులు, వినియోగదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Latest Articles

Related Articles

తొలితరం ఎమ్మార్పీఎస్ రెండు జిల్లాల కమిటీల ఏకగ్రీవ ఎన్నిక!  * ఖమ్మంలో ఘనంగా తొలితరం ఎమ్మార్పీఎస్ ఉద్యమకారుల సమావేశం  * 30 ఏళ్లుగా ఉద్యమంలో త్యాగాలు చేసిన సీనియర్ నాయకుల...

ఖమ్మం, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జ్ యర్ర నాగరాజు రెడ్డి):తొలితరం ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)...

ఇంటర్ విద్యా వ్యవస్థ రద్దు సంస్కరణ కాదు.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు ఆపాలి! పాఠశాల విద్యలో ఇంటర్ విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి: ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్కే...

జూలూరుపాడు, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ - పీఎన్9 తెలుగు న్యూస్):తెలంగాణలో దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యకు పునాదిగా నిలుస్తున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి...

ఖమ్మంలో రాజకీయ అండతో కబ్జాల దందా.. హార్కర్‌ బావి సెంటర్‌లో కాల్వ, రోడ్డు ఆక్రమణల పర్వం!  ప్రభుత్వ స్థలాలు, డ్రైనేజీలే లక్ష్యంగా చెలరేగుతున్న కబ్జాదారులు  నాలుగు షట్టర్లు నిర్మించి దర్జాగా అద్దెకు.. నిత్యం...

 ఖమ్మం, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక - పొలిటికల్ న్యూస్ 9 టీవీ పరిశోధనాత్మక కథనం):ఖమ్మం నగరంలో కబ్జాదారుల అరాచకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. సామాన్యుడు అంగుళం జావు...
error: Content is protected !!