ePaper
Friday, November 13, 2026
📄 ePaper

ఖమ్మంలో రాజకీయ అండతో కబ్జాల దందా.. హార్కర్‌ బావి సెంటర్‌లో కాల్వ, రోడ్డు ఆక్రమణల పర్వం!  ప్రభుత్వ స్థలాలు, డ్రైనేజీలే లక్ష్యంగా చెలరేగుతున్న కబ్జాదారులు  నాలుగు షట్టర్లు నిర్మించి దర్జాగా అద్దెకు.. నిత్యం నరకం చూస్తున్న వాహనదారులు, స్థానికులు   త్రీటౌన్ పోలీస్ స్టేషన్, రైతుబజార్ ప్రాంతంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ కష్టాలు   అధికారులు స్పందించి తక్షణమే ఆక్రమణలను తొలగించాలని ప్రజల ఆగ్రహం

📰 Generate e-Paper Clip

 

ఖమ్మం, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక – పొలిటికల్ న్యూస్ 9 టీవీ పరిశోధనాత్మక కథనం):

ఖమ్మం నగరంలో కబ్జాదారుల అరాచకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. సామాన్యుడు అంగుళం జావు జాగ స్థలం కదుపుదామన్నా వంద నిబంధనలు పెట్టే అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు ఉన్న బడా కబ్జాకోరుల ముందు మాత్రం మౌనం వహిస్తున్నారనే విమర్శలు నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రజా రవాణా రహదారులు, మురుగునీటి కాల్వలనే కబ్జా చేసి షట్టర్లు నిర్మించుకుంటున్నా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

హార్కర్‌ బావి సెంటర్‌లో కబ్జాల పర్వం:

నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన హార్కర్‌ బావి సెంటర్‌లో కబ్జాదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ స్థలాలు, కాల్వలు, రహదారులను ఆక్రమించి ఏకంగా నాలుగు షట్టర్లను నిర్మించి అద్దెకు ఇచ్చినట్లు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

అధికార, ప్రతిపక్షాలకు చెందిన కొందరు అండదండలు ఉండడంతోనే ఇక్కడ బహిరంగంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కొలతలు వేస్తేనే ఈ అక్రమాల బండారం పూర్తిగా బట్టబయలవుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నిత్యం ట్రాఫిక్ నరకం.. ప్రజలకు తప్పని ఇబ్బందులు:

హార్కర్‌ బావి సెంటర్‌ అంటేనే ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. ప్రధాన మార్కెట్‌కు వెళ్లే దారి కావడంతో పాటు, సమీపంలోనే పాఠశాల, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, రైతుబజార్‌ ఉండడంతో నిత్యం వేలాది మంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి కీలకమైన ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం, షట్టర్ల ముందు రోడ్లపైనే వాహనాలు నిలపడం, వ్యాపారాలు నిర్వహించడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మురుగునీటి ముప్పు.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి?

రోడ్లతో పాటు మురుగునీటి కాల్వలను కూడా ఆక్రమించడంతో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. పీఎస్‌ఆర్‌ రోడ్డులో మురుగునీరు నిలిచిపోవడానికి, దుర్వాసన వెదజల్లుతుండడానికి ఈ కబ్జానే ప్రధాన కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పారిశుధ్యానికి విఘాతం కలిగిస్తున్నా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాప్రయోజనాల దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించాలి:

రాజకీయ పలుకుబడి ఎంత ఉన్నా, ఎవరి అండదండలు ఉన్నా ప్రజాధనానికి, ప్రభుత్వ స్థలాలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు నిరూపించాలి. హార్కర్‌ బావి సెంటర్‌లో ఆక్రమణలపై ఖమ్మం నగరపాలక సంస్థ (KMC) కమిషనర్ మరియు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వెంటనే స్పందించి, తక్షణమే రీ-సర్వే నిర్వహించి.. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

 

Latest Articles

Related Articles

తొలితరం ఎమ్మార్పీఎస్ రెండు జిల్లాల కమిటీల ఏకగ్రీవ ఎన్నిక!  * ఖమ్మంలో ఘనంగా తొలితరం ఎమ్మార్పీఎస్ ఉద్యమకారుల సమావేశం  * 30 ఏళ్లుగా ఉద్యమంలో త్యాగాలు చేసిన సీనియర్ నాయకుల...

ఖమ్మం, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జ్ యర్ర నాగరాజు రెడ్డి):తొలితరం ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)...

నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సేవలే లక్ష్యం: సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ మాధవరావు  * ములకలపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక  * బిల్లుల హెచ్చుతగ్గులు, లోవోల్టేజీ, వ్యవసాయ సర్వీసులపై...

ములకలపల్లి (అశ్వారావుపేట), నవంబర్ 12 (పొలిటికల్ పవర్ - ఆర్సీ కారం వెంకటేష్):విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వినియోగదారుల...

ఇంటర్ విద్యా వ్యవస్థ రద్దు సంస్కరణ కాదు.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు ఆపాలి! పాఠశాల విద్యలో ఇంటర్ విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి: ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్కే...

జూలూరుపాడు, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ - పీఎన్9 తెలుగు న్యూస్):తెలంగాణలో దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యకు పునాదిగా నిలుస్తున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి...
error: Content is protected !!