వై.యస్ కి ఇతను ఒకడు ఉన్నాడు అని కూడా తెలిసుండదు…
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
అతను చెప్పే సొల్లు పురాణం చూడండి..
నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి..
పాకిస్తాన్ తో యుద్ధం వస్తుందని ఆర్మీ అధికారి చెప్పాడు..
తన స్థాయికి తగ్గ టీచర్లు లేరు కాబట్టి చదువుకోలేదు..
నక్సలైట్లలో కలుద్దాం అనుకున్నాను..
అన్నీ ఉహాజనితమే…ఇన్ని అనుకుని…ఏమీ కాలేకపోయాడు అంటే..అతని ఆలోచనా స్థితి..అతని కమిట్మెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి…
ఇక చిరంజీవి అంటారా…కాంగ్రెస్ పార్టీలోకి చేరమని వై.యస్.ఆర్..దాసరి నారాయణరావు ద్వారా…ఇతర కాంగ్రెస్ పెద్దలు కూడా ఆహ్వానించారని అంటారు…కానీ చిరంజీవి అహ్యానాన్ని తిరస్కరించారు అని అంటారు. ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ వలన చిరంజీవి ని కొందరు వ్యతిరేకిస్తున్నారు కానీ…ఇంతక ముందు చిరంజీవి అందరివాడు…ఇతర జిల్లాల్లో తెలియదు కానీ…గుంటూరు,..కృష్ణా జిల్లాలకి అతనొక ప్రైడ్…మరొక హీరోకి…అప్పట్లో ఉన్న కులపిచ్చకి.. కొన్ని కులాలు విసిగిపోయి…చిరంజీవిని ఆరాధించే వాళ్ళు… కృష్ణ కి,రామారావు కి మొదటి నుండి అంతగా పడేది కాదు కాబట్టి….కాంగ్రెస్ కి ఆకర్షితులయ్యారు… సినిమా రంగంలో కాంగ్రెస్ సపోర్ట్ చేసిన పెద్ద నటులు దాసరి,కృష్ణ…ప్రజారాజ్యం విలీనం తరువాత చిరంజీవి…అప్పటికి కాంగ్రెస్ లెక్కలో పవన్ లెక్కలో ఉండి ఉండడు. ఇతనొక భట్టిప్రోలు పంచాయితీలు చేసే పెద్దమనిషి టైపు…అంటే…ఇద్దరు కొట్టుకునపుడు…ఎవడు ముందు ఈ పెద్దమనిషి దగ్గరికి వెళ్తే వాడే మంచి వాడు..వాడికి అనుకూలంగా తీర్పు ఇచ్చేవాడు.. గుంటనక్కలన్నీ కలిసి…ఈ వీరుడు… శూరుడు దగ్గరికి వెళ్ళి..నిన్ను వై.యస్ అలా అన్నాడు..ఇలా అన్నాడు అని ఎక్కెయ్యగానే… అప్పుడు ఏం చేయలేక… ఆల్ హోల్స్ మూసుకుని …ఇప్పుడు వీరత్వం చూపిస్తున్నాడుకుంటా.. 2014 లో కూడా గుంటనక్కలు..ముందే ఈయన దగ్గరికి చేరాయ్..జగన్ లక్ష కోట్లు…నీ అంత పోటు గాడు లేడని…చిడతలు కొట్టుంటారు…ప్యాకేజీ…గికేజి…ఎవరి నమ్మకాలు వాళ్లవి…జగన్ లక్ష కోట్లు నమ్మే వాళ్లు అది నమ్ముతారు…ఇతగాడి ప్యాకేజీ నమ్మే వారు ఇది నమ్ముతారు..మధ్యలో భారతదేశంలో కెల్లా రెండో ధనిక ముఖ్యమంత్రి సేఫ్… ఇద్దరు మదగజాలు ఎదురైతే..ఎలా ఉంటుందో..వీళ్ల రాజకీయాలు అంతే ఉంటాయ్ భవిష్యత్తులో… జగన్ కున్న అతి పెద్ద బలం…అతను ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా…అతనికి ఉండే 40% చెక్కు చెదరదు…ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో అది స్పష్టమయ్యింది… కాస్త ఆయన తన స్వభావం మార్చుకుంటే ఇంకాస్త ఓటు శాతం పెరగవచ్చు…పవన్ కళ్యాణ్ ఎటూ తనకి ఆంధ్రాలోనే గతి లేదు అనుకుంటున్నాడు కాబట్టి…తెలుగుదేశంకి అతను దూరం జరిగే పరిస్థితి లేదు. జగన్ని ఎదుర్కోవడానికి బీజేపినైనా వాడుకుంటాడు గానీ…తెలుగుదేశాన్ని మాత్రం వదులుకోడు…
