పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: కొత్తకోట మండలం, కనిమెట్ట గ్రామం: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2022 సంవత్సరంలో నాటిన మొక్కను కనిమెట్ట గ్రామ మాజీ సర్పంచ్ గాదం రాణి పరమేశు శుక్రవారం సందర్శించారు. తాను సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, ఆనాటి బీఆర్ఎస్ దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పాత జంగమయ్యపల్లి రచ్చకట్ట సమీపంలో ఈ మొక్కను నాటినట్లు తెలిపారు. నాలుగేళ్ల క్రితం నాటిన ఆ మొక్క ప్రస్తుతం పెద్ద చెట్టుగా ఎదగడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ రోజుల్లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి వ్యక్తి బాధ్యతగా చెట్లను కాపాడాలని ఆమె సూచించారు. 2022లో నాటిన మొక్కను తిరిగి సందర్శించడం ద్వారా ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

