పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక/పిఎన్9 టీ వీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి డోంగ్లీ మండలంలోని హసన్ టాక్లీ గ్రామంలో సాహిత్య సామ్రాట్, లోక్ షాహిర్ అన్నాభావు సాఠె నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈనెల 30 వ తేదీన చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామజిక ఉద్యమ నాయకులు ఎంఆర్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విచ్చేస్తున్నట్లు హాసన్ టాక్లీ గ్రామ సర్పంచ్ నక్కేవార్ దత్తు పేర్కొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… హైదరాబాద్ లోని తన నివాసంలో ఎంఆర్పీయస్ కామారెడ్డి జిల్లా ఇంచార్జి మంథని సామ్యేల్ మాదిగ నేతృత్వంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా ఆహ్వానించినట్లు సర్పంచ్ దత్తు తెలియజేశారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అంటే వారిని స్మరించుకున్నట్లేనని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రతినిధులు నక్కేవార్ లాలు, బక్కావార్ సాయిలు, నక్కేవార్ మారుతి, సాయినాథ్, బోయి సతీష్, అంకుష్ తదితరులు ఉన్నారు.
ఈనెల 30 న హసన్ టాక్లికి మంద కృష్ణ మాదిగ రాక
RELATED ARTICLES
