
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిది:
ఖమ్మం నల్లగొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నమోదు ప్రక్రియలో భాగంగా ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గార్ల మండల పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ సూచనల మేరకు స్థానిక గార్ల మండల కేంద్రంలో బొడ్రాయి సెంటర్ వద్ద రీత్య ఆన్లైన్ సెంటర్ లో ఉచిత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నమోదు కేంద్రాన్ని గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ విధిగా తమ ఓటును ఆన్లైన్ చేసుకోవాలని సమయం తక్కువగా ఉన్నందున ఇబ్బంది పడకుండా సులభతరంగా అవటం కోసం ఈ ఉచిత ఆన్లైన్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ రామ్ రెడ్డి సర్వోత్తమ రేడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడం కోసం మనందరం కలిసికట్టుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గార్ల మేజర్పంచాయతీ సర్పంచ్ భానోత్ పార్వతీ హాతిరం నాయక్ జాతీయ శ్రీ శక్తి అవార్డు గ్రహీత జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీమతి శంషాద్ బేగం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ హథీరాం నాయక్, మండల గ్రాడ్యుయేట్ కోఆర్డినేటర్లు యేసుమల్ల రాజశేఖర్, భుక్య బాబు లాల్, భుక్య సర్వేశ్ నాయక్, మాలోత్ మాన్సింగ్ నాయక్, రీత్య ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులు మాదా శ్రీకాంత్ పాల్గొన్నారు.
contact number 8977707841

