బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎమ్ వెంకటేశ్వర్లు
కడప జిల్లా అమరుల త్యాగాల స్పూర్తితో ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ముందుకు సాగుదామని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలిపారు. డివైఎఫ్ఐ46 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బద్వేల్ పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న భగత్ సింగ్ విగ్రహం దగ్గర డివైఎఫ్ఐ జెండాను డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని ఆవిష్కరణ చేశారు. నాలుగు రోడ్ల దగ్గర ఉన్న డివైఎఫ్ఐ జెండాను డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమం డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షుడు చిన్ని హాజరయ్యారు
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ… 1980 పంజాబ్ లో ఏర్పాటైన సంఘం నేడు దేశంలోనే ఒక కోటి సభ్యత్వం తో ఉన్న అతి పెద్ద సంఘం డివైఎఫ్ఐ అన్నారు.అందరికీ విద్యా,అందరికీ ఉపాధి లక్ష్యం గా పోరాటాలు నిర్వహిస్తున్నామని.ఈ పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని అన్నారు.దేశ ఐక్యత కోసం,మతసామరస్యం కోసం డివైఎఫ్ఐ పోరాడుతుందని అన్నారు.దేశంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతున్నది అన్నారు.పాలకులు యువతకు ఇచ్చిన వాగ్దానాలు మరిచారన్నారు.ముఖ్యంగా ప్రైవేటీకరణ పేరుతో చిన్న కుటీర పరిశ్రమలను మూసివేసి లక్షల మంది యువత ఉపాధి కోల్పోయారు అన్నారు.కేంద్రం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ,వాక్ స్వాతంత్ర్యాన్ని,హరిచివేస్తున్నది అన్నారు.అందుకు ఉదాహరణ నే డిల్లీ లో జంతర్ మంతర్ వద్ద లక్షలాది యువత ఓట్ చోరీ పై గళం విప్పితే యువత పైన పాశవిక దాడులకు పాల్పడింది అన్నారు.ముఖ్యంగా విభజన హామీలు ఒక్కటి అమలు చేయలేదన్నారు.కడప ఉక్కు, ఏపీ కి హోదా, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అన్ని మరిచారని అన్నారు.విభజన హామీలు అమలు అయితే లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.కానీ పాలక ప్రభుత్వాలు ఇవేవీ పట్టించుకోకుండా విభజన హామీల పై ఊసే ఎత్తడం లేదన్నారు.అమరుల త్యాగాల స్పూర్తితో విభజన హామీల కోసం,ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం రాబోవు రోజులలో పోరాటాలు సాగిస్తామని అందులో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ షరీఫ్ పట్టణ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు పట్టణ నాయకులు గోవర్ధన్ అనిల్ మా భాష రాజ్ కుమార్ నితిన్ రాజా లోకేష్ రాము రెహమాన్ సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

