ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

📰 Generate e-Paper Clip

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్ )

లోక కల్యాణార్థం పంచమఠాలలో విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజాదికాలు జరిపించడం జరిగింది.

కాగా  సోమవారం జరిగిన విశేషపూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణ సంకల్పాన్నిపఠించారు.

ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలనీ, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలనీ, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఘంటామఠంలోని గణపతికి పూజాదికాలు నిర్వహించబడ్డాయి. తరువాత అన్ని మఠాలలో సంప్రదాయబద్దంగా అభిషేకాది అర్చనలను నిర్వహించబడ్డాయి.

కాగా శ్రీశైల సంస్కృతిలో చాలాకాలం పాటు మఠాలు ప్రధానపాత్ర పోషించాయి. ప్రస్తుత సాధారణశకం 7వ శతాబ్దం నుంచి నిర్మించబడ్డ ఈ మఠాలు, గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం లాంటి నిర్మాణాలను కలిగివుండి, చూడటానికి ఆలయాల మాదిరిగానే కనిపిస్తాయి.

కొన్ని శతాబ్దాల నుండి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మికపరంగా, భక్తులకు సదుపాయాలను కల్పించడంలోనూ ప్రధాన భూమికను వహించాయి.

శ్రీశైలంలో కొన్ని మఠాలు కాలగర్భములో కలిసిపోగా, ప్రస్తుతం ఆలయానికి దగ్గరలో వాయువ్య భాగాన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠం అనే మఠాలు పంచమఠాలనే పేర్లతో పిలువబడుతున్నాయి.

కాగా శిథిలావస్థలో ఉన్న ఈ మఠాలలో ఘంటామఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠాలను దేవస్థానం పూర్తిగా పునరుద్ధరించింది. ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలుగకుండా ఈ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయబడ్డాయి. అదేవిధంగా భీమశంకర మఠానికి తగు మరమ్మతులు కూడా చేయబడ్డాయి.

ఈ మఠాలలోని దేవతామూర్తులకు నిత్యధూపదీప నివేదన కైంకర్యాలు జరిపించడం జరుగుతుంది.

Latest Articles

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – పట్టుబడ్డ ఇద్దరు జూదరులు…

  నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్....

Related Articles

కాశినాయన మండలం బాలాయపల్లె, నాయనపల్లె, ఆకుల నారాయణపల్లె ఎస్సీ కాలనీలో ఆదిత్య రెడ్డి కి ఘన స్వాగతం.. జడ్పిటిసి అభ్యర్థి నాగలక్ష్మి ప్రచారానికి ప్రజల నీరాజనం!

కలసపాడు పొలిటికల్ పవర్ నవంబర్ 2 పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు వైఎస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం బాలాయపల్లి,...

అమరుల త్యాగాల స్పూర్తితో ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ముందుకు సాగుదాం. అమరుల త్యాగాల స్పూర్తితో విభజన హామీల సాధన కోసం పోరాడదాం.     – డివైఎఫ్ఐ కడప జిల్లా...

     బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎమ్ వెంకటేశ్వర్లుకడప జిల్లా అమరుల త్యాగాల స్పూర్తితో ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ముందుకు సాగుదామని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని...

ప్రజాస్వామ్యంపై దండయాత్ర: జర్నలిస్టుల గొంతు నొక్కుతున్న పచ్చమూకలు!  * పులివెందులలో జాతీయ మీడియా ప్రతినిధులపై దాడి తీవ్రమైన హేయమైన చర్య  * కూటమి ప్రభుత్వంలో కనుమరుగవుతున్న పత్రికా స్వేచ్ఛ ...

విజయవాడ (విశేష ప్రతినిధి నాగరాజు రెడ్డి :పొలిటికల్ పవర్)రాష్ట్రంలో పచ్చమూకల అరాచకం హద్దులు దాటుతోంది! ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే పత్రికా రంగాన్ని భయభ్రాంతులకు గురిచేసే కుట్రలు ముమ్మరమయ్యాయి. ప్రజల సమస్యలను, ఎన్నికల...
error: Content is protected !!