
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 2 నవంబర్ 2026.
రుద్రూర్ మండల కేంద్రంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని బొప్పాపూర్ రోడ్డులో గల ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన పక్కా సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6620/- రూపాయలు నగదు మరియు పేక ముక్కలను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎల్. రామ్ తెలిపారు.

