ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు బీఎల్ఏలు సహకరించేలా రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలి 

ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు బీఎల్ఏలు సహకరించేలా రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలి 

📰 Generate e-Paper Clip

–   జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక  పిఎన్ 9 న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 23. 2026.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్‌ఏలు) ఎన్నికల అధికారులతో సమన్వయంతో పని చేసేలా చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ ఐ ఆర్ పురోగతిపై జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ డిజిటైజేషన్ 77.49 శాతంపూర్తయిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గానే కొనసాగుతున్నప్పటికీ, వనపర్తి, పెబ్బేరు వంటి పట్టణ ప్రాంతాల్లో కొంత నెమ్మదిగా కొనసాగుతోందని తెలిపారు. కాబట్టి, పట్టణ ప్రాంతాల్లో ఆయా రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు స్థానికంగా పని చేస్తున్న బూత్ లెవల్ అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని తెలిపారు. బిఎల్ఓలతో సహకరిస్తూ ఓటర్లందరూ తమ ఎన్యుమరేషన్ ఫారంలను సమర్పించే విధంగా బి ఎల్ ఏ లు చొరవ తీసుకోవాలని సూచించారు.రాబోయే మూడు నుంచి నాలుగు రోజులు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అత్యంత కీలకమైనవని తెలిపారు. ఈ సమయంలో రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు అధికారులకు పూర్తి సహకారం అందించి, ఇంకా ఎవరైనా ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారం లు తిరిగి ఇవ్వకపోతే, వారు పూరించి ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (Rationalisation) ప్రక్రియకు కూడా ఇదే సరైన సమయమని, ఇందుకు సంబంధించి కూడా రాజకీయ పార్టీలు ఏవైనా సూచనలు చేయదలుచుకుంటే అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ అన్నారు.సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!