ePaper
Sunday, August 23, 2026
📄 ePaper
Homeతెలంగాణఎస్సి /ఎస్టి కేసులో విజయం – హైకోర్టు న్యాయవాది పొన్నం రవీందర్‌కు ఘన సన్మానం

ఎస్సి /ఎస్టి కేసులో విజయం – హైకోర్టు న్యాయవాది పొన్నం రవీందర్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 23 2026: బాలీద్‌పల్లి గ్రామం, అడ్డకల్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా: గత నెలలో జరిగిన SC/ST కేసులో విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాది పొన్నం రవీందర్‌ను కలిసి గ్రామానికి చెందిన వారు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది పొన్నం రవీందర్ మాట్లాడుతూ… “చివరికి న్యాయమే గెలుస్తుంది. న్యాయవ్యవస్థపై ప్రతి ఒక్కరూ నమ్మకం ఉంచాలి. బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తూ కేసును ముందుకు తీసుకెళ్తాం” అని అన్నారు. బాధితుల తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించి కేసులో విజయం సాధించిన న్యాయవాది పొన్నం రవీందర్‌ను గ్రామస్థులు అభినందించారు. న్యాయం కోసం ఆయన చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులోనూ బాధితులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొని న్యాయవాది పొన్నం రవీందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!