ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper

దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మంది గర్భిణులకు సామూహిక సీమంతం

📰 Generate e-Paper Clip

ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్‌ఎస్‌  నాయకులు సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 21: దమ్మపేట అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మంది గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ.. ప్రతి మహిళ జీవితంలో మాతృత్వం ఒక అపురూపమైన, మరపురాని అనుభూతి అని అన్నారు. గర్భిణులు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పోషకాహారం తీసుకుంటూ, అవసరమైన వ్యాయామం చేయాలని సూచించారు. గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించడం ద్వారా వారిలో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు.దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దమ్మపేట మండలంలోని గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించడం అభినందనీయమని సోయం వీరభద్రం అన్నారు. ఇటువంటి సామాజిక, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

లింగాలపల్లిలో ఘన సన్మానం

అనంతరం దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామానికి చేరుకున్న సోయం వీరభద్రం గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ యువత, యువకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ విద్యతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో ముందుండే లింగాలపల్లి యువతను అభినందించారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ గ్రామ అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్, చిన్న అరుణాచల శివాలయ వ్యవస్థాపకులు గురూజీ శివనాగరాజు స్వామి, అరుణానంద స్వామి, అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ పసుమర్తి రామభద్రరావు, దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి-రాంబాబు, వైద్యురాలు మౌనిక, దమ్మపేట మండల మాజీ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా ఇన్‌చార్జి గిద్దా కొండయ్య, చెపా నాగు, తాటి రవికుమార్, సరియం విజయ్‌కుమార్, మోడియం శ్రీను, అశ్వారావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకులు వాడే వీరస్వామి, లింగాలపల్లి గ్రామ యువత, యువకులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Available next action: Create a downloadable DOCX file here in this chat containing the editable prose above

Latest Articles

ఆకలితో ఎవ్వరూ బాధపడకూడదు.. అన్ని దానాలు కన్నా అన్నదానం మిన్న

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

” సమ్మక్క-సారక్క అంతర్జాతీయ విమానాశ్రయం”గా నామకరణం చేయాలి

తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక వైభవానికి, చారిత్రక వారసత్వానికి, వీరత్వానికి ప్రతీక. కాకతీయుల...

అగ్ని ప్రమాద బాధితులకు అండగా శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

14000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీ హాస్టల్ వార్డెన్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

ఒక్క పుట్టినరోజు కోసం ఒక జీవితాన్నే కోల్పోవాలా..?

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*🚨 ఒక్క బర్త్‌డే కోసం... ఒక జీవితాన్ని కోల్పోవాలా?💔...

ములకలపల్లిలో తాటి విస్తృత పర్యటన

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు.ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీలుపొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్21: వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు...

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గర్వకారణం – న్యాయరంగంలో మరో...
error: Content is protected !!