ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper

ములకలపల్లిలో తాటి విస్తృత పర్యటన

📰 Generate e-Paper Clip

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు.

ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీలు

పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్21: వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు ములకలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంజీవ్‌పల్లి, పూసుగూడెం, ములకలపల్లి ఆంజనేయస్వామి ఆలయం, గుల్లగూడెం, కంపగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను తాటి వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామాల్లో ఐక్యత, సోదరభావాన్ని చాటిచెప్పేలా నిర్వహించుకోవడం అభినందనీయమని తాటి వెంకటేశ్వర్లు అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు.ఆయా గ్రామాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తాటి వెంకటేశ్వర్లును శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్ల గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్న ఆయన.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామస్తులతో తాటి వెంకటేశ్వర్లు ఆప్యాయంగా ముచ్చటించారు. గణనాథుడి ఆశీస్సులతో ములకలపల్లి మండలంలోని ప్రతి గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖశాంతులు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనం పద్మ, మాజీ సర్పంచ్ వాడే నాగరాజు, రాజేష్, శనగపాటి సీతారాములు, బండి కొమురయ్య, సునీల్ కుమార్, కొండవీటి చంద్రశేఖర్, పుష్పల హన్మంత్, పుష్పల సాయి, రవి, నరటి రమేష్, అనుమల సాయి, ఇమ్మానియేల్, బొర్ర సుధాకర్, సడియం నరసింహారావు, సడియం అశోక్, సోడే శ్రీనివాస్, సడియం శ్రీను, బొర్ర మోహన్, సడియం ప్రసాద్, సడియం ప్రవీణ్, సడియం కళ్యాణ్, భూక్య నందా, నాగరాజు, శివ, నరేంద్ర, రోహిత్, చరణ్, మహేష్, నీరజ, కుమార్మీడియం మహేష్, బొర్రా రవి, కణితి వినోద్, ఊకె కిరణ్, ఊకె నవీన్, ఊకే గణేష్, ఊకే రాజేంద్ర, సున్నం రాజకుమార్, ఊకే మోటు, ఊకె కిరన్ బాబు తదితరులు అలాగే స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

 

 

Latest Articles

చికరుచెట్టు తండా అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై అవగాహన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో దళారులకు చోటు లేదు

రైతులు, భూ హక్కుదారులు అప్రమత్తంగా ఉండాలి.. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు:...

జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.. ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా చర్యలు

కర్ణాటక బయలుదేరనున్న మంత్రులు, ఎమ్మెల్యేల బృందంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి

-పలుస శంకర్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /...

సార్ ప్రక్రియతో 43.98 లక్షల ఓట్లపై ఉత్కంఠ

నోటీసులు అందుకున్న వారిలో 53.62 శాతం మంది విచారణకు గైర్హాజరు కొడంగల్‌లో 96...

గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సమన్వయంతో ముందుకు సాగుదాం..సెప్టెంబర్...

Related Articles

నిజం ఎప్పుడూ జైలు నుంచే బయటకు వస్తుంది, తీర్పు మాత్రం ఎప్పుడూ కూలర్ లోనే ఉంటుంది

మసి బూట్ల హీరో తిరిగి వచ్చాడు!*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*సీన్ ఓపెన్ చేస్తే...

వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దళిత, గిరిజన మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అత్యంత ప్రాముఖ్యమైనది, నిరుపేదలకు...

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*భూమి - ఒక ఆత్మగౌరవ ప్రతీక అనంతపురం జిల్లాలోని...

దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మంది గర్భిణులకు సామూహిక సీమంతం

ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్‌ఎస్‌  నాయకులు సోయం వీరభద్రం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 21: దమ్మపేట అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మంది గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని...
error: Content is protected !!