ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeతెలంగాణఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి

ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి

📰 Generate e-Paper Clip

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు

జి.శివకుమార్ పిలుపు

ఐలమ్మ 41,వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ కాలనీలో అన్నదానం నిర్వహించిన

రజక వృత్తిదారుల సంఘం శ్రేణులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ డెస్క్ చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో బద్వేల్ ఐలమ్మ కాలనీ అభివృద్ధి కోసం పోరాటాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం బద్వేల్ టౌన్ లోని ఐలమ్మ కాలనీలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీను అధ్యక్షతన ఐలమ్మ 41,వ వర్ధంతి సభ జరిగింది సభకు ప్రధాన ఉపన్యాసకులుగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి జి.శివకుమార్ మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ గారు 1895 వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ వరంగల్ జిల్లా కృష్ణాపురం గ్రామంలో జన్మించాలని 1985 సెప్టెంబర్ 10వ తేదీన మరణించారని వారు తెలిపారు. ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులతో కలిసి పోరుబాట పట్టారని చదువు లేకపోయినా ఆ రోజుల్లోనే భూమి సమస్య పరిస్కారం కోసం కోర్టులో పోరాటం చేశారని వారు గుర్తు చేశారు. బద్వేల్ టౌన్ లో ఇంటి స్థలాలు లేని పేదలు పోరాటం నిర్వహించి 16 సంవత్సరాల క్రితం కాలనీ ఏర్పాటుచేసుకున్నారని ఈ కాలనీకి పోరాట యోధురాలు ఐలమ్మకు గుర్తుగా ఆమె పేరు పెట్టుకున్నారని వారు తెలిపారు,కాలనీ ఏర్పడి 16 సంవత్సరాలు అయిన అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని చాకలి ఐలమ్మ కాలనీ అభివృద్ధి కోసం పోరుబాట పట్టాలని కాలనీ అభివృద్ధి జరిగేంత వరకు పోరును ఆపకూడదని కాలనీ అభివృద్ధి చేయడమే ఐలమ్మ గారికి అర్పించే నిజమైన నివాళని అందుకోసం కాలనీవాసులు నడుము బిగించాలని వారు పిలుపునిచ్చారు. పట్టణ పేదల సంక్షేమ సంఘం బద్వేల్ కన్వీనర్ కే,శ్రీనివాసులు ఆవాజ్ జిల్లా కార్యదర్శి చాంద్ బాషా లు మాట్లాడుతూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాలనీ అభివృద్ధి చేస్తామని నాయకులు హామీ ఇవ్వడం తప్ప ఏ ప్రభుత్వంలో కూడా కాలనీకి చిన్న పని కూడా జరగలేదని అధికార పార్టీల మాటలు నీటి మీద రాతల్లాగే మిగిలిపోతున్నాయి తప్ప కాలనీ గురించి పట్టించుకునే నాయకుడు లేడని వారు విమర్శించారు. వర్ధంతి సభ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గురుమూర్తి, వృత్తిదారువ సంఘం బద్వేల్ పట్టణ కార్యదర్శి నాగార్జున,బద్వేల్ పట్టణ వృత్తిదారుల సంఘం ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు బద్వేల్ పట్టణ ఆవాజ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎస్ అత్తార్ అన్వర్ భాష,NPRD నాయకులు మూరా ప్రసాదు నాయి బ్రాహ్మణ పట్టణ సంఘం నాయకులు సుబ్బరాయుడు, శివకృష్ణ వెంకటేశ్వర్ల, ఐలమ్మ కాలనీ వాసూలు బాబయ్య, వెంకట సుబ్బయ్య,మహబూబ్ బాషా లక్ష్మయ్య, బొడ్డు రవి, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!