ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఒంటరి అయినా చిన్నారి(భవ్య శ్రీ) కి ఆర్థిక సహాయం..

ఒంటరి అయినా చిన్నారి(భవ్య శ్రీ) కి ఆర్థిక సహాయం..

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 14 2026: పెద్దమందడి జిల్లా పరిషత్ పాఠశాల 2005- 2006 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తోటి స్నేహితురాలి కూతురికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందించారు. పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన (రేణుక ) పెద్దమందడి మండల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-06 లో పదో తరగతి చదివారు . నెల క్రితం అనారోగ్యంతో అమె మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు ఒంటరి అయిన తన స్నేహితురాలి కూతురి కి తమ వంతు ఏమైనా సహాయం చేయాలని అనుకున్నారు. రేణుక కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్న స్నేహితులు, తమతో పాటు చదువుకున్న స్నేహితురాలి కూతురు భవ్య శ్రీ కి స్నేహితులు అందరూ కలిసి జమ చేసుకున్న 50,000/వేల రూపాయలను ఆర్థిక సహకారాన్ని అందించారు.ఈ నగదు మొత్తాని (భవ్య శ్రీ) పేరు మిద బ్యాంకు లో ఫిక్స్ డిపాజిట్ చెయ్యలని నిర్ణంచారు. భవిష్యత్తులో కూడా (రేణుక)కూతురు (భవ్య శ్రీ) చదువుల విషయంలో ఎలాంటి సహకారం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చిన్నారిని ధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో 2005-06 బ్యాచ్ స్నేహితులు అందరు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!