ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆన్లైన్ బెట్టింగులకు బలైతున్న యువత... లక్షల్లో సొమ్ము మాయం...

ఆన్లైన్ బెట్టింగులకు బలైతున్న యువత… లక్షల్లో సొమ్ము మాయం…

📰 Generate e-Paper Clip

ఆన్లైన్ బెట్టింగులకు బలైతున్న యువత…

లక్షల్లో సొమ్ము మాయం…

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టివి ప్రతినిధి నిజామాబాద్ జిల్లా…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అనేక మండలాలలో ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు యువత బలైపోతున్నట్లు స్పష్టమైన సమాచారం.
ఇట్టి ఆన్లైన్ బెట్టింగ్ మోసాలపై పోలీసుల అనేక విధాలుగా ప్రచారo చేస్తూ, శ్రమిస్తున్నప్పటికిని, ఈజీగా మనీ సంపాదించి లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకునే దుర్బుద్ధ ఉద్దేశంతో, ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రుద్రూర్ మండల కేంద్రంలో, ఒక యువకుడి ఆడియో లీకేజీ రుద్రూర్ మండల కేంద్రంలో చక్కర్లు కొడుతున్న సందర్భంలో,కొంతమంది యువకులు తరచుగా ఆన్లైన్ బెట్టింగులు కట్టే పరిస్థితిలో ఇతను కూడా అలవాటుగా మార్చుకొని ఆన్లైన్ బెట్టింగ్ లో కొన్ని లక్షల రూపాయలు నష్టపోయినట్టు, ఇది ఇతర మిత్రుల ద్వారా తను కూడా అలవాటు పడ్డట్టు స్పష్టమైన ఆడియో వైరల్ అవుతున్నట్టు ప్రజల గుసగుస. నిరుపేద ప్రజల డబ్బుతో వ్యాపారాలు చేస్తూ, నిరుపేదల డబ్బులతో ఇలా బెట్టింగులు కడుతూ నష్టపోయిన సందర్భంగా చేతులెత్తేసే పరిస్థితి తెచ్చుకుంటున్న కొంతమంది వ్యాపారస్తులను కూడా ఇటీవలి కాలంలో అనేక సందర్భాలలో బయటపడుతున్నట్టు సమాచారం. ప్రజల సొమ్ముతో ఇలాంటి ఆన్లైన్ బెట్టింగుల వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తుల, పై నిగా పెట్టు వీరిపై కూడా తగిన చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఇటీవలి కాలంలో రుద్రూర్ మండల కేంద్రంలో గంజాయి సరఫరా చేస్తున్న మూటను కూడా రుద్రూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు పంపిన ఘనత రుద్రూర్ పోలీసులకు,చెందినప్పటికీని, ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు యువకులు బలైపోతున్న విషయం పోలీసులకు సవాలుగా మారింది.యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా గ్రామ సభల ద్వారా కానీ స్పష్టమైన సమాచారంతో, పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టి యువతను మంచి మార్గంలో నడిపించాలని ప్రజలు కోరుతున్నారు.


 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!