మహబూబాబాద్ (పొలిటికల్ పవర్): మాలోత్ అజయ్ నాయక్ (గార్ల )
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గుర్రం అన్నపూర్ణ అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ సమాచారం అందుకున్న బయ్యారం పట్టణ, గంధంపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆమె స్వగృహానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నివాళులర్పించిన వారిలో బయ్యారం మాజీ ఎంపీపీ గుగులోత్ కిషన్ నాయక్, బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి, గంధంపల్లి-కొత్తపేట గ్రామశాఖ అధ్యక్షుడు కారుబోతుల రామ్మూర్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావురి రామచంద్రయ్య, నందగిరి భద్రయ్య, సీనియర్ రిపోర్టర్ మద్దినేని గుట్టయ్య తదితరులు ఉన్నారు.

