ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపకారు అబ్రహం సేవలు ప్రశంసనీయం....

కారు అబ్రహం సేవలు ప్రశంసనీయం….

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ పిఎన్9 టివి సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా. ఉపాధ్యాయ వృత్తికి కారు. అబ్రహం చేసిన సేవలు ప్రశంసనీయమని, నంద్యాల డయాసిస్ బిషప్, సంతోష్ ప్రసన్న రావు పేర్కొన్నారు. సోమవారం కలసపాడు టౌన్ చర్చ్ ఆవరణలో కారు అబ్రహం ఆదరణ కూడిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసిన మంచి పనులే ఆయనకు చిరస్థాయిగా నిలిచి పోతాయన్నారు. ఉపాధ్యాయుడిగా కారు అబ్రహం ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకు బాట వేశారన్నారు. అంతే కాకుండా,ఆలయ నిర్వహణలో కీలకపాత్ర పోషించారన్నారు. సమాజ సేవతో పాటు దైవ సేవ చేసిన ఆయన ప్రభువు సన్నిధికి చేరుతారన్నారు. ప్రతి వ్యక్తి మరణ అనంతరం ,ఆస్తి, పాస్తులు ధనము, బంగారము, వెంట తీసుకెళ్ల లేరని ఆయన వెంట తీసుకు వెళ్ళేది కీర్తి ప్రతిష్టలు మాత్రమే అన్నారు. సమాజ సేవ చేసిన కారు అబ్రహం ప్రభు సన్నిధిలో శాశ్వతంగా నిలిచి పోతారన్నారు.. కార్యక్రమంలో ఇన్చార్జి డీన రీ చైర్మన్ రెవరెండ్.బండి శామ్యూల్, ప్రెస్బిటర్ రెవరెండ్ ఆశిష్ గాబ్రియేల్, రెవరెండ్ డాక్టర్ పెరుమాళ్ళ వరప్రసాద్, రెవరెండ్ సంజయ్ మధు,రెవరెండ్ గద్ద మధుకర్, రెవరెండ్ పీటర్, రెవరెండ్ అక్కిదాసరీ జాన్సన్ విజయ్ కుమార్, రెవరెండ్ సతీష్, రెవరెండ్ స్టీఫెన్, రెవరెండ్ సంగటి మధు, రెవరెండ్ కృపాకర్, రెవరెండ్ ఆశీర్వాదం, రెవరెండ్ రజీత్, శ్రీమతి దాసరి బ్యూలా సంతోష్,ఏసుదాస్ స్వామిపాదం, ఎలిమెంటరీ స్కూల్ జాతీయ నాయకులు పిల్లి రమణారెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్, జోజయ్య నాయుడు బోయిల్ల రోశిరెడ్డి, సత్య నారాయణ, నాగదాసరి రవి క్రీస్తుదారి,బత్తుల కిషోర్, పెద్దిటీ సైమన్,పల్లవోలు కమలాకర్,పబ్బతి ప్రసన్న, బత్తుల డేవిడ్,పెట్లు వరదరాజు, తెలుగు రాష్ట్రాల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, జాకోబ్,కారు రత్న ప్రభాకర్,ఎద్దు సురేష్, కురేష్,కారు రవి, పెద్దిటి సునీల్,కారు.జె. ప్రవీణ్ కుమార్,హానోక్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!