పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.26.2026.కూతురు క్రీడల్లో రాణించాలన్న తండ్రి ఆకాంక్షకు తోడు తోటి విద్యార్థులకు సాయం చేయాలన్న ఆమె ఆలోచనను ప్రోత్సహిస్తూ అరుణ,మొగిల్లన్నదంపతులుఆదర్శంగా నిలిచారు.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వారి కుమార్తె నిస్సిత కబడ్డీపై ఆసక్తికనబరుస్తూజిల్లాసబ్‌జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైంది.ఈ సందర్భంగా నిస్సిత తల్లిదండ్రులు పెబ్బేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని తోటి విద్యార్థులకుఉచితంగాస్పోర్ట్స్,డ్రెస్సులను పంపిణీ చేశారు. చిన్న వయసులోనే ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన నిస్సితను పలువురు అభినందించారు. నిస్సిత క్రీడా ప్రతిభను ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ మాధవి, పీడీ స్వప్న, పీఈటీ దివ్యభారతి, ఉపాధ్యాయురాలు మంజులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వార్డెన్ జె. బెనర్జీ, ప్రధానోపాధ్యాయులునర్సింహగౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు జె.ఎం. మీషేక్, జిల్లా క్రీడల ప్రధాన కార్యదర్శికురుమన్నతదితరులుమొగిల్లన్నను శాలువాతో సన్మానించి అభినందించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తితో పాటు సేవా భావాన్ని పెంపొందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
కూతురు కోరికను నెరవేర్చిన తండ్రి తోటి విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ
Latest Articles
మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...
*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*
మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళకాలనీలో తొమ్మిది...
*గణనాథుడికి వీడ్కోలు అంబరాన్ని అంటిన శోభాయాత్ర*
మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళమేడిపల్లి కమల...
ఇంద్రపల్లి హరిణి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా బృందం
మృతురాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
ఘటనపై సమగ్ర...
జవహర్‌నగర్‌లో దశాబ్దాలుగా నివాసముంటున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలి
ప్రజలకు పూర్తి హక్కులు కల్పించాలి.. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు...
Related Articles
మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను...
బంజారా సేవా సంఘం మదనాపూర్ మండల అధ్యక్షుడిగా రవినాయక్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: మదనాపూర్ మండల బంజారా సేవా సంఘం అధ్యక్షుడిగా మూడవత్ రవినాయక్...
చాకలి ఐలమ్మ సేవలు విశ్వజనీనం సమాజానికే ఆదర్శం
– కొత్తకోట పట్టణ రజక సంగం అధ్యక్షుడు పి.బాలస్వామి,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.26.2026.సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట...


