పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు22.2026.వనపర్తిజిల్లాకొత్తకోటపట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భీమ చంద్రకాంత్ ఆధ్వర్యంలోశ్రావణమాసంరెండవశుక్రవారంసందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో వైభవంగానిర్వహించారు.వరలక్ష్మీవ్రతాన్నిపురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకపూజామండపం ఏర్పాటు చేసి అమ్మవారిని పూలతో అలంకరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, వరలక్ష్మీ వ్రత కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సామూహిక వ్రతాల్లో కొత్తకోట పట్టణానికి చెందిన మహిళలు పెద్దఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో హాజరై పసుపు, కుంకుమ, పూలు, పండ్లు తదితర పూజా సామగ్రితో వరలక్ష్మీదేవిని ఆరాధించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతోకిటకిటలాడింది.భక్తులకుఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామూహికంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.వరలక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రజలందరికీఆయురారోగ్యాలు,ఐశ్వర్యం,సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ మహిళా ప్రముఖులు భీమ ప్రసన్న లక్ష్మీ , జయలక్ష్మి , రాధిక , మంజుల తదితరులు ఏర్పాట్లు చేశారు.
కొత్తకోట లో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
0
2
- Advertisment -


