– వనపర్తి జిల్లా స్థాయి సౌత్‌జోన్ అథ్లెటిక్స్ సెలక్షన్స్‌లో కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ప్రతిభ చాటారు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి
న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు22.2026.వనపర్తిజిల్లాస్థాయిసౌత్‌జోన్,అథ్లెటిక్స్,సెలక్షన్స్‌లో కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ప్రతిభ చాటారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోనిడాక్టర్.బాలకృష్ణయ్యక్రీడాప్రాంగణంలోజిల్లాస్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సెలక్షన్స్‌లో అప్పరాల గ్రామానికి చెందిన కావలి సాయి చందన అండర్-20 విభాగంలో డిస్కస్ త్రోలో ప్రథమస్థానంసాధించగా,ఆమెచెల్లెలుకావలినవ్యశ్రీ,అండర్-14 విభాగంలో జావెలిన్ త్రోలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో వీరు ఆగస్టు 27, 28 తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సౌత్‌జోన్ అథ్లెటిక్స్ మీట్-2026కు ఎంపికయ్యారు. అక్కాచెల్లెళ్లు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించడంపట్లగ్రామస్థులు,క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. వీరి ప్రతిభకు వ్యాయామ శిక్షకుడు ఎం. అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.

