ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజ్వరంతో వచ్చిన వారికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి 

జ్వరంతో వచ్చిన వారికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి 

📰 Generate e-Paper Clip

–  వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల   ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్ రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు22.2026.వర్షాకాలంలోసీజనల్,వ్యాధులనియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిఆదేశించారు.శుక్రవారంవనపర్తిపట్టణంలోనిరామ్‌నగర్ కాలనీలో కలెక్టర్ పర్యటించి ఆరోగ్య సిబ్బందిఫ్రైడేడ్రైడే,కార్యక్రమంనిర్వహిస్తున్నతీరునుపరిశీలించారు. కాలనీలో పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పరిసరాలనుపరిశుభ్రంగాఉంచేలాప్రజలకుఅవగాహనకల్పించాలని సూచించారు.జ్వరం వంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లు గుర్తిస్తే వారికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. దోమల వృద్ధికి అవకాశం లేకుండా నిల్వనీటినితొలగించడం,పారిశుద్ధ్యచర్యలనునిరంతరంచేపట్టాలని సూచించారు. జలుపతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.అనంతరం రామ్‌నగర్ కాలనీలోని మున్సిపల్ పార్కును కలెక్టర్ పరిశీలించారు. పార్కు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. పార్క్ లో అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఫైల్ పెట్టాలని మున్సిపల్,అధికారులనుఆదేశించారు.అదేవిధంగా,పట్టణంలోనిరుపయోగంగా ఉండి అభివృద్ధినోచుకోని పార్కులను గుర్తించి నివేదిక సమర్పించాలని కమిషనర్ కు ఆదేశించారు. తద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైనవాతావరణంకల్పించేలాపార్కులనుఅభివృద్ధిచేయాలనిసూచించారు.అనంతరం కేడీఆర్ నగర్‌లోని బస్తీ దవాఖానాను కలెక్టర్ సందర్శించి ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైనవైద్యసేవలుఅందించాలని,అవసరమైనమందులుఅందుబాటులో ఉండేలా చర్యలుతీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.ముఖ్యంగా పాము కాటు, కుక్క కాటు బాధితులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలాచూసుకోవాలని సూచించారు. జ్వరంతో వచ్చే ప్రతి రోగికి అవసరాన్ని బట్టి మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.బస్తీ దవాఖానాలో మందుల నిల్వలు, వైద్య సేవలు, రోగుల వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, స్థానిక కౌన్సిలర్ పరుశురాం, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!