గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జెండా ఆవిష్కరణ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 9 2026: హైదరాబాద్ క్విట్ ఇండియా డే సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ… క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మరువకూడదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ పుస్తక ప్రదర్శనను నాయకులు సందర్శించారు. అలాగే గాంధీజీ విగ్రహాలను తిలకించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, సీనియర్ నాయకులు పాండు రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.




