ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeతెలంగాణయూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలో పాల్గొన్న -డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక...

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలో పాల్గొన్న -డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 09 2026: యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాభవన్ లో యూత్ కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… భారత దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ యువత ముందుకు రావాలి యువత దేశానికి ఆదర్శం కాబట్టి యూత్ కాంగ్రెస్ ను స్థాపించడం జరిగినది. ఆనాటి నుండి నేటి వరకు యూత్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకల పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్న యువత కు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి యువకులు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. బిజెపి పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండాలని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి, టీపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, సీనియర్ నాయకులు పాండు రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!