ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఖమ్మం నగర స్థానిక 29వ డివిజన్ నందు గత కార్పొరేటర్ మరియు కాంట్రాక్టర్లు కలిసి పేద...

ఖమ్మం నగర స్థానిక 29వ డివిజన్ నందు గత కార్పొరేటర్ మరియు కాంట్రాక్టర్లు కలిసి పేద ప్రజల స్థలమునందు కమీషన్లకు కక్కుర్తి పడి సైడ్ కాలువ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన తీరు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 18 2026: నిన్న సాయంకాలం ఖమ్మం నగరం నందు కురిసిన చిన్నపాటి వర్షం కు సైడ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం ద్వారా సామాన్య పేద ప్రజలు నివాసం ఉండే ఇంటిలోకి మురుగు నీరు చేరి సంఘటన ఖమ్మం నగర స్థానిక 29వ డివిజన్ నందు చోటు చేసుకున్నది. స్థానిక ప్రజలు ఆవేదన గత ఐదు సంవత్సరముల నుండి ప్రభుత్వంలో నందు ఉండి ఎటువంటి పనులు చేయించకుండా చివరి దశలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్ తో చేతులు కలిపి స్థానిక కార్పొరేటర్ అడ్డదిడ్డంగా డ్రైనేజీ కట్టి మా మా ఇంటి నందు మురికి నీరు చేరే విధంగా కట్టినారు అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇట్టి విషయమై స్థానిక కాలువ కట్టిన కాంట్రాక్టర్ నీ మరియు అడగగా కార్పొరేటర్ చెప్పిన విధంగా నేను సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేసినాను అని దౌర్జన్యంతో పేద ప్రజల మీద సమాధానం ఇస్తున్నాడు. ఇట్టి విషయమై మున్సిపాలిటీ కమిషనర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ తమరు ప్రత్యేకమైన సమయం కేటాయించి మా పేద ప్రజల పరిస్థితులను గమనించగలరని వేడుకుంటున్నాము.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!