-పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 04 2026: పెబ్బేరు కళాకారులు సమాజానికి, సంస్కృతికి ప్రతిబింబం లాంటి వారని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. పెబ్బేరు టౌన్ లో వీఎంసీ రికార్డింగ్ స్టూడియోను ఏర్పాటు చేసి ఔత్సాహిక గాయకులను, కళాకారులను ప్రోత్సహిస్తున్న యెల్లా రెడ్డి అభినందనీయులని అన్నారు. ఈ సందర్భంగా వీఎంసీ స్టూడియోలో యెల్లా రెడ్డిని శాలువా, మెమెంటోతో ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి స్టూడియోలు ఎంతో అవసరమని, తెలంగాణ జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పృథ్వీ రాజ్, వెంకటస్వామి, షఫీ, చంద్రయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

