– జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు ఆదేశం,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు
14.2026
ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. కొత్తకోట మండలం అమడబాకులలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను గురువారం ఆయన సందర్శించి వసతులు, విద్యాబోధన, నిర్వహణ తీరును పరిశీలించారు. ముందుగా కళాశాలలోని స్టాక్ రూమ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్.. విద్యార్థులకు అందిస్తున్న నిత్యావసర సరుకుల నాణ్యత, నిల్వలు, సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి సరుకులకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.అనంతరం భోజనశాలను పరిశీలించి పరిశుభ్రత, పారిశుద్ధ్య పరిస్థితులను తనిఖీ చేశారు.విద్యార్థులకునాణ్యమైన,పరిశుభ్రమైన ఆహారం అందించాలని, భోజనశాల పరిసరాలను పరిశుభ్రంగాఉంచాలనిఆదేశించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన కలెక్టర్ విద్య, వసతులు, భోజనం, ఇతర సౌకర్యాల పై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలనుసద్వినియోగంచేసుకునికష్టపడిచదివిమంచిమార్కులుసాధించాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించేలా స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విద్యుత్ సమస్యను కలెక్టర్ దృష్టికితీసుకెళ్లడంతోపాటు విద్యార్థుల సౌకర్యార్థం ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటుకు కూడా అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. విద్యార్థుల విద్యా ప్రగతితోపాటు వారి ఆరోగ్యం, భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈకార్యక్రమంలో డీఎస్‌సీ కార్పొరేషన్ సిరాజుద్దీన్‌తోపాటు కళాశాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.